Tollywood : స్విమ్ సూట్ ధరించిన ఫస్ట్ హీరోయిన్.. ఒక్కసారిగా మారిన క్రేజ్.. చివరకు కన్నీటి విషాదం..

Tollywood : స్విమ్ సూట్ ధరించిన ఫస్ట్ హీరోయిన్.. ఒక్కసారిగా మారిన క్రేజ్.. చివరకు కన్నీటి విషాదం..


సినీరంగంలో మొదటి సారి గ్లామరస్ బ్యూటీగా కనిపించిన హీరోయిన్ ఎవరో మీకు తెలుసా..? మొదటి సారి బిగ్ స్క్రీన్ పై గ్లామర్ హీరోయిన్ గా..స్విమ్ సూట్ ధరించింది. నీలి కళ్లు.. చూడ చక్కని రూపంతో అప్పట్లో కుర్రకారును ఊర్రూతలూగించింది. ఒక సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఆ హీరోయిన్.. చివరి రోజులు మాత్రం ఒంటరిగా గడిపింది. ఈరోజు (ఫిబ్రవరి 18) ఆమె శతజయంతి. ఒకప్పుడు సినీరంగంలో అందం, ప్రతిభతో పాపులర్ అయిన ఆమె జ్ఞాపకాలు పంచుకుంటున్నారు సినీప్రముఖులు. మొదటి సారి సిల్వర్ స్క్రీన్ పై స్విమ్ సూట్ ధరించిన హీరోయిన్ పేరు నళిని జయవంత్. 1926లో ముంబైలో జన్మించిన ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాల పట్ల ఆసక్తి ఎక్కువే. 14 సంవత్సరాల వయసులో ఒక పార్టీలో చిత్రనిర్మాత చిమన్‌లాల్ దేశాయ్ ఆమెను చూసి రాధిక చిత్రంలో అవకాశం ఇచ్చారు. కానీ ఆమె తండ్రి ఆ ఆఫర్ సున్నితంగా తిరస్కరించారు. చివరకు 1941లో బిగ్ స్క్రీన్ పైకి తెరంగేట్రం చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Folk Song : ఏం క్రేజ్ రా మావా.. 35 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్.. దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్..

కథానాయికగా, గాయనిగా తనదైన ముద్ర వేసింది. దాదాపు 40 పాటలకు తన గాత్రాన్ని అందించి సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. 1950లో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. బాలీవుడ్ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. సమాధి, సంగ్రామ్ వంటి చిత్రాలు ఆమెను సూపర్ స్టార్ గా మార్చాయి. తెరపై స్విమ్ సూట్ ధరించిన మొదటి భారతీయ నటిగా నిలిచింది. 1960 చివరి నాటికి కొత్త హీరోయిన్ల రాకతో ఆమె క్రేజ్ నెమ్మదిగా తగ్గిపోయింది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరోగా సినిమా.. ఒక్క ఫైట్ లేకుండా తీస్తే ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసింది.. నిర్మాత కామెంట్స్..

ఆమె గురించి అనేక రూమర్స్ వినిపించాయి. అదే సమయంలో నటుడు ప్రభుదయాళ్‌ను వివాహం చేసుకుంది. 2001లో తన భర్త మరణించిన తర్వాత, పిల్లలు లేకుండా, నళిని పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయింది. 2009లో ఆమె మరణించినప్పుడు, మూడు రోజుల పాటు ఎవరికీ దాని గురించి తెలియదు. ఆమె శరీరం తాళం వేసిన ఇంట్లో కుళ్ళిపోయింది. దూరపు బంధువు ఒకరు వచ్చినప్పుడు మాత్రమే ఆమె మరణ వార్త తెలిసింది.

ఎక్కువ మంది చదివినవి : Actress Pratyusha : హీరోయిన్ ప్రత్యూష మృతి కేసు.. వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం..

Nalini Jaywant Movies

Nalini Jaywant Movies

ఎక్కువ మంది చదివినవి :  Actress Prathyusha : స్టార్ హీరోలతో సినిమాలు.. కెరీర్ పీక్స్‏లో సూసైడ్.. హీరోయిన్ ప్రత్యూష ఎలా చనిపోయిం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *