Big Bash League In India: 2026-27 బిగ్ బాష్ లీగ్ (BBL 2026-27) తొలి మ్యాచ్‌ను భారతదేశంలో నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియా పరిశీలిస్తున్నట్లు సమాచారం. బిగ్ బాష్ లీగ్ వాణిజ్య కార్యకలాపాల అధిపతి బిల్ రిగ్బీ, మరో అధిపతి మార్గోట్ హార్లే ఇటీవల చెన్నైలో మ్యాచ్‌ను నిర్వహించే అవకాశాన్ని అన్వేషించడానికి భారతదేశానికి వెచ్చారంట. భారతదేశంలోని అన్ని వర్గాల జనాభా నుంచి క్రికెట్‌కు మద్దతు లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
2025–26 బీబీఎల్ సీజన్ ఫైనల్లో పెర్త్ స్కార్చర్స్ సిడ్నీ సిక్సర్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి 6వ సారి ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 క్రికెట్ లీగ్‌లలో పెర్త్ స్కార్చర్స్ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఇంతలో, ఆస్ట్రేలియా నుంచి భారతీయ మార్కెటింగ్‌ను ఆకర్షించడానికి క్రికెట్ ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ తదుపరి సీజన్‌ను చెన్నైలో ప్రారంభించాలని పరిశీలిస్తోంది. ఈ ప్రణాళిక ఇంకా ధృవీకరించబడలేదని, క్రికెట్ ఆస్ట్రేలియా అనేక స్థాయిలలో ఆమోదం పొందాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
బీపీఎల్‌ను భారతదేశంలో నిర్వహించాలంటే, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ప్రసారకుల నుంచి అనుమతి పొందడం ముఖ్యం. భారత, దక్షిణాసియా అభిమానులను అనుసంధానించడం క్రికెట్ ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్ అవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న 2026 టీ 20 ప్రపంచ కప్ చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరిగిన అన్ని మ్యాచ్‌లకు భారీ ప్రేక్షకులు హాజరయ్యారు. దీని ప్రకారం, బీపీఎల్‌ను చెన్నైలో నిర్వహిస్తే, అభిమానుల మద్దతు ఖచ్చితంగా లభిస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తోంది.
బిగ్ బాష్ లీగ్..
బిగ్ బాష్ లీగ్ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్‌లలో ఒకటి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు పాల్గొన్నారు. రవిచంద్రన్ అశ్విన్ 2025-26 బిగ్ బాష్ లీగ్‌లో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. కానీ గాయం కారణంగా అతను వైదొలిగాడు. అశ్విన్ సిడ్నీ సిక్సర్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకోవడం గమనార్హం.