కేంద్ర ప్రభుత్వం రైతులకు అందిస్తున్న పీఎం కిసాన్ సాయం జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 21 విడతల డబ్బులు విడుదల చేయగా.. 22వ విడత కోసం దేశంలోని లబ్దిదారులందరూ ఎదురుచూస్తున్నారు. రూ.2 వేలు ఎప్పుడెప్పుడు అకౌంట్లోకి వస్తాయా అని నిరీక్షిస్తున్నారు. ఎట్టకేలకు రైతుల ఎదురుచూపులకు చెక్ పడింది. ఈ నెల చివరిలోనే పీఎం కిసాన్ నగదు అందించేందుకు కేంద్రం సిద్దమైంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ ద్వారా చెల్లింపులు చేయనుండగా.. ఇందుకు రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఈ కేవైసీ పెండింగ్‌లో ఉండే పీఎం కిసాన్ నగదు జమ కావని స్పష్టం చేసింది. దీంతో రైతులందరూ దీనిని అప్‌డేట్ చేయించుకోవాలని సూచించింది.
ఫిబ్రవరి చివరి వారంలో వచ్చే ఛాన్స్..!
గత వాయిదాల ట్రెండ్‌ను పరిశీలిస్తే.. పీఎం కిసాన్ నగదును ఫిబ్రవరి చివరి వారంలో తప్పనిసరిగా జమ చేయనున్నారని తెలుస్తోంది. 19వ విడత సొమ్మును ఫిబ్రవరి 24న విడుదల అవ్వగా.. 16వ విడత నగదును 2024 ఫిబ్రవరి 28న జమ చేశారు. ఇక 2023లో 13వ విడత పీఎం కిసాన్ ఫిబ్రవరి 27న విడుదల చేశారు. గత సంవత్సరాల్లో విడుదల చేసిన తేదీలను చూసుకుంటే 22వ విడత తప్పనిసరిగా ఈ నెలాఖరులో జమ కానుందని తెలుస్తోంది. డీబీటీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో వీటిని విడుదల చేయనున్నారు.
మీకు వస్తుందో..? రాదో..? ఎలా తెలుసుకోవాలి..?
-పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ https://pmkisan.gov.in పోర్టల్ ఓపెన్ చేయండి
-లబ్దిదారుల జాబితాపై క్లిక్ చేయండి
-రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామం ఎంచుకోండి
-ఆ తర్వాత సబ్మిట్‌పై క్లిక్ చేయండి
-అర్హత ఉన్న రైతుల పేర్లు కనిపిస్తాయి
-ఇందులో మీ పేరు ఉండి కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి ఉంటే పీఎం కిసాన్ అకౌంట్లో పడతాయి
-ప్రతీ విడతకు ముందు లబ్దిదారుల జాబితాను కేంద్రం అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. అనర్హులను జాబితా నుంచి తొలగిస్తుంది. ఇటీవల కూడా కొంతమంది పేర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది
స్టేటస్ చెక్ చేసుకోండి
-ఇక పీఎం కిసాన్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ లేదా Kisan eMitra చాట్‌బాట్‌లోకి వెళ్లండి
-నో యువర్ స్టేటస్‌పై క్లిక్ చేయండి
-రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి
-22వ విడత స్టేటస్ దగ్గర మీకు డబ్బులు వస్తాయో.. రావో తెలుసుకోవచ్చు.