Majjiga Charu: ఆంధ్రా స్పెషల్ మజ్జిగ చారు ఇలా ఎప్పుడైనా తయారు చేశారా..? ఘుమఘుమలకే కడుపు నిండిపోద్ది..

Majjiga Charu: ఆంధ్రా స్పెషల్ మజ్జిగ చారు ఇలా ఎప్పుడైనా తయారు చేశారా..? ఘుమఘుమలకే కడుపు నిండిపోద్ది..


ఎండల్లో చల్లదనం అందించేందుకు మజ్జిగ, మజ్జిగ చారు వంటివి ప్రతి ఇంట్లో అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా మజ్జిగ చారు అన్నంలో వేసుకుని తింటే ఆ రుచే వేరు. అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ రెసిపీ చేస్తుంటారు. దీంతో రుచి కూడా వేర్వేరుగా వస్తుంది. తాజాగా ప్లాంట్‌ ఫ్యూచర్‌ అనే ఇన్‌స్టా ఖాతాలో మజ్జిగ పులుసు వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీని తయారీ విధానం, ఇందులో ఏమేం వేయాలో ఈ కింది వీడియోలో చూద్దాం..

కావల్సిన పదార్ధాలు..

ఇందుకోసం 2 కప్పుల పెరుగు లేదా మజ్జిగ, అర టీ స్పూన్‌ అల్లం ముక్కలు, ఒక పచ్చి మిర్చి, తరిగిన ఉల్లి, నీళ్లు, రుచికి సరిపడా సాల్ట్‌, 2,3 స్పూన్ల నూనె, ఒక స్పూన్‌ ఆవాలు, ఒక స్పూన్‌ జీలకర్ర, అర స్పూన్‌ మినపప్పు, అర స్పూన్‌ పచ్చి శనగపప్పు, చిటికెడు ఇంగువ, 2 ఎండు మిర్చి, 2 లవంగం మొగ్గలు, 2 వెల్లుల్లి రెబ్బలు, 5 కరివేపాకు రెబ్బలు, అర స్పూన్ పసుపు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

తయారీ విధానం..

ముందుగా పెరుగు తీసుకుని అందులో అల్లం ముక్కలు, పచ్చి మిర్చీ ముక్కలు, సరిపడా ఉప్పు, కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత చిక్క బడేంత వరకు ఈ మిశ్రమాన్ని చిలకాలి. అనంతరం స్టౌ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆయిల్‌ వేసుకోవాలి. నూనె వెడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుని చిటపట అన్నాక మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకుని గోల్డ్‌ కలర్‌ వచ్చే వరకు వేయించాలి. తర్వాత ఇంగువ, ఎండు మిర్చీ, వెల్లులి రెబ్బలు, లవంగం మొగ్గలు వేసుకుని లేతగా వేయించుకోవాలి.

అనంతరం కరివేపాకు, తురిమిన ఉల్లి ముక్కలు వేసి ఉల్లి ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు చల్లి కొన్ని సెకన్లు వేయించాలి. చివర్లో చిలికి పెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకుని కొద్దిగా వేడి చేసుకోవాలి. అంతే ఘుమఘుమలాడే మజ్జిగ చారు రెడీ. దీనిని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే భలేగా ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *