టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల పెళ్లి వార్తల ఇప్పుడు నేషనల్ వైడ్ హాట్ టాపిక్‌గా మారాయి. సిల్వర్ స్క్రీన్ పై తమ కెమిస్ట్రీతో మ్యాజిక్ చేసిన ఈ జంట ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ ఒక్కటి కానున్నారు. ఇప్పటికే వీరి ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇక ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా విజయ్- రష్మికల వివాహం అత్యంత వైభవంగా జరగనుందని తెలుస్తుంది. ఇందుకోసం ఏర్పాట్లు చకా చకా జరుగుతున్నాయి. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం ఉదయ్‌పూర్‌లోని ఓ విలాసవంతమైన ప్యాలెస్‌లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే రష్మిక- విజయ్ ల పెళ్లి వేడుక కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో జరగనున్నట్లు తెలుస్తోంది. . అయితే మార్చి 4న సినీ, రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్‌ను ప్లాన్ చేశారు. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ కన్వెన్షన్ సెంటర్ ఈ రిసెప్షన్ పార్టీని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణాదితో పాటు బాలీవుడ్ నుంచి కూడా పలువురు సినీ ప్రముఖులు విజయ్-రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరుకానున్నట్లు సమాచారం. కాగా విజయ్ దేవరకొండకు అత్యంత సన్నిహితుడు, డైనమిక్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ పెళ్లి వేడుకకు హాజరుకానున్నట్లు సమాచారం. అలాగే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్కీ కౌశల్ వంటి స్టార్స్ కూడా సందడి చేయనున్నారని సమాచారం. వీరితో పాటు విజయ్, రష్మిక లతో కలిసి పనిచేసిన ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, టెక్నీ షియన్లు, స్నేహితులు, సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొననున్నట్లు సమాచారం.
కాగా ఇటీవల విజయ్ దేవరకొండ – రష్మిక మంధాన పెళ్లి కార్డు ఇదేనంటూ ఓ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ‘మా జీవితంలో అత్యంత ముఖ్యమైన, పెద్ద వేడుకకి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మా కుటుంబాల ప్రేమ, ఆశీర్వాదంతో నేను, రష్మిక.. 26.02.26న ఓ చిన్న, సంప్రదాయ వేడుక ద్వారా పెళ్లి చేసుకోబోతున్నాం. మా జీవితంలో ఓ కొత్త అధ్యయనాన్ని ప్రారంభించబోతున్నాం. మా ఇద్దరి ఈ ప్రయాణంలో భాగమైన మీరంతా కూడా మా వివాహ వేడుకలో పాలుపంచుకుని, మాకు అందమైన అనుభూతులను అందించాలని కోరుకుంటున్నాం’ అంటూ రాసి ఉన్న శుభ లేఖ, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్చి 4 బుధవారం రాత్రి 7 గంటల నుంచి హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో విజయ్ దేవరకొండ – రష్మిక మంధానల రిసెప్షన్ జరగబోతున్నట్టు కూడా ఈ శుభలేఖలో రాసి ఉంది. అయితే ఇప్పటిదాకా విజయ్ దేవరకొండ కానీ, రష్మిక మంధాన కానీ తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటించలేదు.
ఇవి కూడా చదవండి
మూడు రోజుల గ్రాండ్ వెడ్డింగ్..
The long wait ends in the most beautiful way!
Wedding bells are ringing for Vijay Deverakonda and Rashmika Mandanna as their big day is officially locked for 24th, 25th & 26th February. A grand three-day celebration awaits in the royal city of Udaipur where love meets legacy… pic.twitter.com/X1eAngbsqM
— RolexMemesX (@RolexRuler) February 17, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.