Tollywood: ఒకప్పుడు నగల షాపులో సేల్స్ గర్ల్.. ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ నటి.. పవన్‌ కల్యాణ్ కు వీరాభిమాని

Tollywood: ఒకప్పుడు నగల షాపులో సేల్స్ గర్ల్.. ఇప్పుడు టాలీవుడ్ ఫేమస్ నటి.. పవన్‌ కల్యాణ్ కు వీరాభిమాని


ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది ఒకప్పుడు ఎన్నో ఇబ్బందులు పడిన వారే. పొట్ట కూటి కోసం చిన్న చితకా ఉద్యోగాలు, పనులు చేసిన వారే. ఈ టాలీవుడ్ స్టార్ యాంకర్ కమ్ నటి కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. చాలా మంది నటిగా గుర్తింపు తెచ్చుకుందామని హైదరాబాద్ వచ్చింది. హాస్టల్ లో ఉండి యాక్టింగ్ నేర్చుకుంది. స్నేహితులు, సన్నిహితుల సహకారంతో సినిమాల్లో అవకాశాలు సొంతం చేసుకుంది. కానీ మధ్యలో అత్తింటి వారు ఒప్పుకోరన్న కారణంతో ఇండస్ట్రీకి దూరమైంది. కొద్దిగా గ్యాప్ తీసుకుని మళ్లీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించింది. ఆపై బిగ్ బాస్ లోనూ సత్తా చాటింది. ఇప్పుడు స్టార్ యాంకర్ గానూ, నటిగానూ మెప్పిస్తోన్న ఆ అందాల తార మరెవరో కాదు స్రవంతి చొక్కారుపు. సుహాస్ నటించిన హే బలవంత్ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించిందీ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ బ్యూటీ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.

‘నేను ఆరో తరగతి నుంచే మెహందీ పెట్టేదాన్ని. బ్యూటీ పార్లర్ తో టై అప్ అయి మెహందీ పని చేసి డబ్బులు సంపాదించేదాన్ని. యాక్టర్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చాను. దిల్‌షుక్ నగర్ లో హాస్టల్ లో ఉండి యాక్టింగ్ నేర్చుకుంటున్నా. నా హాస్టల్ ఫ్రెండ్ ఒక అమ్మాయికి షూటింగ్ లో తెలిసిన వాళ్లు ఉన్నారని రాజశేఖర్ మహంకాళి సినిమా షూటింగ్ కి తీసుకెళ్లింది. నేను ఊరికే హీరోతో ఫోటో దిగి వచ్చేద్దాం అనుకోని బాగా రెడీ అయి వెళ్లాను. అయితే ఆ రోజు షూట్ లో ఒక అమ్మాయి రాలేదు. నన్ను చూసి ఆ అమ్మాయి ప్లేస్ లో యాక్టింగ్ చేస్తావా అని అడగటంతో మనం అందుకేగా వచ్చింది అని ఓకే చెప్పా. సుమారు 12 రోజులు ఆ సినిమాకు పనిచేశా. అందులో జర్నలిస్ట్ క్యారెక్టర్ లోఅక్కడక్కడా కనిపిస్తా. డైలీ 3000 ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులతో మా అమ్మకు పట్టుచీర కొనిచ్చా’

ఇవి కూడా చదవండి

‘అయితే మా లవర్ తో పెళ్లి కోసం వాళ్ల ఇంట్లో సినిమాలు అంటే ఒప్పుకోరు అని సినిమాలు వదిలేశాను. అయితే పెళ్లి అయ్యాక కొన్ని ఆర్థిక సమస్యలు రావడంతో మా ఆయనతో పాటు నేను కూడా జాబ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఒక గోల్డ్ షాప్ లో సేల్స్ గర్ల్ గా వర్క్ చేశాను. ఇక్కడే మన హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ నగల దుకాణంలో పనిచేశాను. కానీ ఆ జాబ్ కి ఎక్కువ సేపు నిల్చోవాల్సి వచ్చింది. దీంతో హెల్త్ ఇష్యూస్ వచ్చి నా వల్ల కావట్లేదు అని మా ఆయనకు చెప్పి జాబ్ మానేసాను. ఆ తర్వాత మా ఆయన ఫ్రెండ్ పరిచయంతో ఓ ఛానల్ లో యాంకర్ గా మొదలుపెట్టాను. అక్కడ్నుంచి యాంకర్ గా నా కెరీర్ స్టార్ట్ అయింది’ అని ఎమోషనల్ అయ్యింది యాంకర్ స్రవంతి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *