Indian Railways: రైళ్లలో పిల్లలకు టిక్కెట్‌ తీసుకోవాలా? వద్దా? అసలు రైల్వే రూల్స్‌ ప్రకారం ఈ డబుల్‌ ఆప్షన్స్‌ గురించి తెలుసా?

Indian Railways: రైళ్లలో పిల్లలకు టిక్కెట్‌ తీసుకోవాలా? వద్దా? అసలు రైల్వే రూల్స్‌ ప్రకారం ఈ డబుల్‌ ఆప్షన్స్‌ గురించి తెలుసా?


ప్రయాణీకుల సంక్షేమం, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇండియన్‌ రైల్వే పలు రాయితీలు, స్పష్టమైన నిబంధనలను అమలు చేస్తోంది. అయితే పిల్లల టికెట్ల విషయంలో సరైన సమాచారం లేకపోవడంతో చాలామంది గందరగోళానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న తప్పుడు ప్రచారం కారణంగా కొందరు జరిమానాలు కూడా చెల్లించాల్సి వస్తోంది. అందుకే అధికారిక నియమాలను తెలుసుకోవడం అత్యంత అవసరం.

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. 5 సంవత్సరాలు నిండని పిల్లలు (0–4 ఏళ్లు) రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చు. వారికి టికెట్ అవసరం లేదు. అయితే వారికి ప్రత్యేక సీటు లేదా బెర్త్ కేటాయించరు. తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో కలిసి ప్రయాణించాలి. ప్రత్యేక బెర్త్ కావాలంటే పూర్తి వయోజన చార్జీతో టికెట్ బుక్ చేయాలి. 5 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు రెండు ఎంపికలు ఉన్నాయి. ప్రత్యేక సీటు లేదా బెర్త్ అవసరం లేకపోతే సగం చార్జీతో టికెట్ పొందవచ్చు. కానీ ప్రత్యేక సీటు కావాలంటే పూర్తి చార్జీ చెల్లించాలి. 12 సంవత్సరాలు నిండిన తర్వాత వారిని పెద్దలుగా పరిగణిస్తారు. ఈ వయస్సు పైబడిన వారికి ఎటువంటి రాయితీలు ఉండవు. హాఫ్ టికెట్‌పై ప్రయాణిస్తే నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తారు.

టికెట్ బుకింగ్ సమయంలో IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో పిల్లల వయస్సును కచ్చితంగా నమోదు చేయాలి. చైల్డ్ (సీటు/బెర్త్ లేదు) లేదా చైల్డ్ (సీటు/బెర్త్ అవసరం) ఎంపికలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. సరైన టికెట్‌తో ప్రయాణించడం ద్వారా జరిమానాలను నివారించడంతో పాటు పిల్లల భద్రత కూడా నిర్ధారించవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *