నా బిడ్డను అత్యాచారం చేసి చంపారు..సాక్ష్యాలు ఉన్నాయి

నా బిడ్డను అత్యాచారం చేసి చంపారు..సాక్ష్యాలు ఉన్నాయి


నటి ప్రత్యూష మరణం వెనుక అసలు నిజాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయని ఆమె తల్లి సరోజినీ దేవి వాపోయారు. తన కూతురిని అత్యాచారం చేసి, హత్య చేశారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని, పోస్టుమార్టం నివేదికను పరిగణనలోకి తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యూష శరీరం మీద పలుచోట్ల గోర్లతో రక్కిన గాయాలు, మెడపై ఒత్తిన గుర్తులు ఉన్నాయని డాక్టర్ మునిస్వామి సమర్పించిన పోస్టుమార్టం నివేదిక స్పష్టంగా పేర్కొందని సరోజినీ దేవి తెలిపారు. అయితే, ఈ నివేదికను సీబీఐ, సెషన్స్ కోర్టు, హైకోర్టు వంటి ఏ సంస్థ కూడా పరిగణనలోకి తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి విరుద్ధంగా, ఒక నెల తర్వాత ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ, మృతదేహాన్ని పరిశీలించకుండా కేవలం కొన్ని నివేదికల ఆధారంగా ప్రత్యూషది ఆత్మహత్య అని తేల్చిందని, ఆ నివేదికను మాత్రమే స్వీకరించారని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సారీ బన్నీ.. అల్లు అర్జున్ కు ఆ ఇద్దరు క్షమాపణలు

CM Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యక్తి తెలంగాణ జాతి పిత ఎలా అవుతారు

KTR: కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామన్నారు.. కానీ తెలంగాణయే కేసీఆర్ ఆనవాళ్లు

లక్కీ డ్రాలో కాంగ్రెస్ లక్.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు

శివరాత్రి వేళ స్మశానంలో మంత్రి.. ఏంచేశారో తెలుసా ??



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *