జనగామ మరియు తొర్రూరు మున్సిపాలిటీలలో ఛైర్పర్సన్ పదవుల ఎన్నిక తీవ్ర ఉత్కంఠ మధ్య ముగిసింది. ఇరు పార్టీలకు సమానంగా ఓట్లు రావడంతో లక్కీ డ్రా నిర్వహించగా, కాంగ్రెస్ అభ్యర్థులకు అదృష్టం వరించింది. జనగామలో కాంగ్రెస్ అభ్యర్థి బాలమణి, తొర్రూరులో శ్రావణ్ లక్కీ డ్రా ద్వారా ఛైర్పర్సన్లుగా ఎన్నికయ్యారు. ఈ విజయం తర్వాత బాలమణి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో మున్సిపల్ హాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. తొర్రూరులోనూ లక్కీ డ్రా ద్వారానే ఛైర్పర్సన్ ఎన్నిక జరిగింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలలో 12 స్థానాలనూ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ సాధించింది. ఇది కాంగ్రెస్ శ్రేణులలో సంబరాలకు దారితీసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శివరాత్రి వేళ స్మశానంలో మంత్రి.. ఏంచేశారో తెలుసా ??
లక్ష్మణుడు లేని అరుదైన శ్రీరామ ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా
Allu Sirish Haldi: అల్లు వారి హల్దీ వేడుక.. స్పెషల్ అట్రాక్షన్‌గా ఉపాసన
కపుల్ ఫ్రెండ్లీ సినిమాకు.. డార్లింగ్ బ్యూటిఫుల్ రివ్యూ..
Trisha: తీవ్ర వివాదాస్పదంగా నైనార్ కామెంట్స్.. తమిళనాడులో రాజకీయ దుమారం