కాలం కలిసి వస్తే.. అదృష్టం తలుపు తడుతుందంటే ఇదే..! మున్సిపల్ చైర్మన్, వైస్-చైర్మన్‌గా భార్యాభర్తలు..!

కాలం కలిసి వస్తే.. అదృష్టం తలుపు తడుతుందంటే ఇదే..! మున్సిపల్ చైర్మన్, వైస్-చైర్మన్‌గా భార్యాభర్తలు..!


Husband And Wife Elected As Chairman And Vice Chairman Of Aswaraopet Municipality

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీకి తొలి చైర్మన్‌గా జూపల్లి శశికళ, ఆమె భర్త జూపల్లి రమేష్ బాబు వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ప్రధాన అనుచరుడుగా పేరొందిన జూపల్లి రమేష్ దంపతులు నూతన మున్సిపాలిటీ ఎన్నికల్లో 6వ ,13వ వార్డుల్లో పోటీ చేసి గెలుపొందారు. నూతనంగా గెలుపొందిన కౌన్సిలర్లు జూపల్లి దంపతులను చైర్మన్, వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో దంపతులు ఇద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు.

మూడు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఇది మరువలేని రోజు అని జూపల్లి రమేష్ బాబు అన్నారు. గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, సెంట్రల్ లైటింగ్, క్రీడా ప్రాంగణం సహా ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, మరో మూడేళ్లలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు తాను చేసే అభివృద్ధి ఎమ్మెల్యేకు రెఫరాo డంగా ఉంటుందనన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీని ప్రజలు అత్యధిక మెజారిటీలతో గెలిపించి దీవించారని, దీంతో తనపై మున్సిపాలిటీ అభివృద్ధి బాధ్యత మరింత పెరిగిందని జూపల్లి రమేష్ బాబు తెలిపారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆధ్వర్యంలో మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతామని, పేద ప్రజలకు ఇళ్ళు ఇవ్వాలన్నదే తన ధ్యేయమని, కౌన్సిల్ సభ్యులందరం ఏకతాటిపై ఉండి అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్నికల్లో గెలిపించి ఆశీర్వదించిన మున్సిపాలిటీ ప్రజలందరికీ జూపల్లి దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

 మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *