TG Inter Hall Tickets 2026: రేపే ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

TG Inter Hall Tickets 2026: రేపే ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే


హైదరాబాద్‌, ఫిబ్రవరి 17: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల హాల్‌టికెట్లు బుధవారం (ఫిబ్రవరి 18) విడుదలకానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు ఏర్పాట్లు చేస్తుంది. బుధవారం హాల్‌ టికెట్లు విడుదలైన తర్వాత విద్యార్థులు ఇంటర్‌బోర్డు కాలేజీ లాగిన్‌ ద్వారా హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవడానిక అవకాశం ఇస్తుంది. అలాగే ఫిబ్రవరి 20న విద్యార్థుల తల్లిదండ్రుల రిజిస్టర్డ్‌ వాట్సాప్‌ నంబర్‌కు హాల్‌టికెట్లను పంపిస్తారు. దీంతో విద్యార్ధులు నేరుగా వాట్సప్‌ నుంచే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇంటర్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ నుంచి కూడా విద్యార్థులు నేరుగా హాల్‌ టికెట్‌ తీసుకోవచ్చు. అంటే కాలేజీ లాగిన్‌ ఐడీ, ఇంటర్‌ వెబ్‌సైట్‌, వాట్సాప్‌.. మూడు విధాలుగా ఇంటర్ బోర్డు హాల్‌టికెట్లను పంపనుంది. విద్యార్ధులు ఎక్కడి నుంచైనా వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

వెబ్‌సైట్‌ నుంచి నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్లపై ప్రిన్సిపాల్‌ సంతకం లేకపోయినా పరీక్షకు అనుమతిస్తామని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. అయితే హాల్‌ టికెట్లపై విద్యార్ధి పేరు, ఫొటో, సబ్జెక్టుల్లో తప్పులు దొర్లితే కాలేజీ ప్రిన్సిపాళ్లను సంప్రదించి సవరించుకోవాలని సూచించింది. ఈ ఏడాది ఇంటర్‌ హాల్‌టికెట్లపై క్యూఆర్‌కోడ్‌ను సైతం ముద్రిస్తున్నారు. దీంతో విద్యార్ధులు పరీక్ష కేంద్రం కోసం గందరగోళం పడకుండా రూట్‌మ్యాప్‌ ద్వారా నేరుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.

కాగా తెలంగాణ ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరుగున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,96,529 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరుకాబోతున్నారు. మొత్తం 1495 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాలో పకడ్భందీగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తు్న్నారు. పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు గతేడాది మాదిరిగానే 5 నిమిషాల గ్రేస్ టైమ్‌ ఇస్తుంది. టైం టేబుల్‌ ప్రకారం ఇంటర్ విద్యార్ధులకు పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రంలోకి ఉదయం 9 గంటలలోపు చేరుకోవల్సి ఉంటుంది. అయితే ఇంటర్ బోర్డు ఇచ్చిన గ్రేస్‌ టైం మేరకు ఉదయం 9.05 గంటల వరకు విద్యార్ధులకు అనుమతి ఇస్తుంది. చివరి నిమిషంలో గందరగోళానికి గురికాకూడదంటే విద్యార్థులు ఉదయం 8.45 గంటలలోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *