Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్..

Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్..


తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది.. పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి.. ఉదయం వేళ్లల్లో మాత్రమే చలి ఉంటోంది.. ఆ తర్వాత ఎండలు మండిపోతున్నాయి.. ఈ క్రమంలోనే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో తమిళనాడు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వాతావరణ శాఖ ప్రకారం.. నిన్నటి తూర్పు భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగాలపై ఉన్న అల్పపీడన ప్రాంతం నెమ్మదిగా పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి, ఈరోజు, ఫిబ్రవరి 17, 2026న ఉదయం 0830 గంటలకు, భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం మరియు దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతం మీదుగా విస్తరించి ఉంది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడన ప్రాంతం ఫిబ్రవరి 18, 2026 నాటికి పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం మీదుగా మరింతగా బలపడే అవకాశం ఉంది..

అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ – యానములో దిగువ ట్రోపో ఆవరణములో తూర్పు, ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-

మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. మోస్తరు పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

రాయలసీమ:-

మంగళవారం బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

గమనిక :- రాగల 3 రోజుల్లో కోస్తాంద్ర లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదులో గణనీయమైన మార్పు లేదు, రాగల 2 రోజుల్లో రాయలసీమ లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణముకంటే 2-4 డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముంది.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు ప్రధానముగా ఆగ్నేయ దిశ నుండి వీచుచున్నవి.. వీటి ఫలితంగా రాగల 3 రోజులు.. మంగళవారం, బుధవారం, గురువారం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *