Business Idea: కేవలం రూ.20 వేల పెట్టుబడితో లక్షాధికారి కావచ్చు.. ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండే సులభమైన వ్యాపారం!

Business Idea: కేవలం రూ.20 వేల పెట్టుబడితో లక్షాధికారి కావచ్చు.. ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండే సులభమైన వ్యాపారం!


Business Idea: కేవలం రూ.20,000 పెట్టుబడితో లక్షలాధి రూపాయలు సంపాదించుకునే అద్బుతమైన బిజినెస్‌ ఇది. ఈ వ్యాపారాన్ని ప్రతి ఒక్కరు సులభంగా చేసుకోవచ్చు. ఎలాంటి చదువు అవసరం లేదు. సులభంగా డబ్బులు సంపాదించుకునే మార్గాలలో ఈ బిజినెస్‌ ఒకటి. ఇది తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడినిచ్చే వ్యాపారం. Business Idea: కేవలం రూ.20,000 పెట్టుబడితో స్వచ్ఛమైన నాటుకోడి పెంపకం ప్రారంభించి, గణనీయమైన లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా రూ.1,00,000 వరకు సంపాదించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఒక గంట సమయం కేటాయించడం ద్వారా ఈ వ్యాపారాన్ని డెవలప్‌ చేసుకోవచ్చంటున్నారు.

నాటుకోడి పిల్లల ఎంపిక, ఖర్చులు:

వ్యాపార విజయానికి స్వచ్ఛమైన నాటుకోడి పిల్లలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. సోనాలి, డిపి, ఆసిల్, వనరాజ, గిరిరాజ వంటి క్రాస్‌బ్రీడ్‌లు తక్కువ ధరలో (రూ.20-రూ.40) లభించినప్పటికీ, అవి నాణ్యతలో తక్కువ. ఈ కోళ్లు కిలో రూ.180-రూ.200 మాత్రమే విక్రయిస్తారు. స్వచ్ఛమైన నాటుకోడి మాత్రం కిలో రూ.400-రూ.500 వరకు ధర పలుకుతుంది. బోనాల పండుగ వంటి, ఇతర పండగల సమయాల్లో ఒక పుంజు రూ.1,000-రూ.1,500 వరకు అమ్ముడుపోతుంది.

ప్రారంభ పెట్టుబడిలో భాగంగా 200 స్వచ్ఛమైన నాటుకోడి పిల్లలను ఒక్కొక్కటి రూ.60 చొప్పున కొనుగోలు చేయడానికి రూ.12,000 ఖర్చవుతుంది. దాణా కోసం ముందుగా రూ.8,000 కేటాయించాలి. ఇది ఒక్కో సంచి రూ.1,800-రూ.2,000 చొప్పున నాలుగు సంచులకు సరిపోతుంది. ఈ దాణా మూడు నెలల వరకు 200 కోడి పిల్లలకు సరిపోతుంది.

ఇవి కూడా చదవండి

దాణా, పోషణ:

మొదటి మూడు నెలల తర్వాత రైతులు తమ పొలాల్లోని మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలను దొడ్డు రవ్వలా పట్టించి దాణాగా వాడవచ్చు. పొలాలు లేనివారు కూలీ పనికి వెళ్లి సంపాదించిన డబ్బుతో దాణా కొనుగోలు చేయవచ్చు. ఆరు నెలలపాటు పోషించిన తర్వాత ఒక కోడి సుమారు 1.5 కిలోలు, పుంజు 2 కిలోలు బరువు పెరుగుతాయి. స్వచ్ఛమైన నాటుకోడి కిలో రూ.400కు విక్రయిస్తే 1.5 కిలోల కోడి నుండి రూ.600 ఆదాయం వస్తుంది. 200 పిల్లలలో 30 పిల్లలు మరణించినా (ఇది సాధారణం), మిగిలిన 170 కోళ్ల నుండి రూ.1,02,000 ఆదాయం పొందవచ్చు. ఇది అంచనా. ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. రూ.20,000 ప్రారంభ పెట్టుబడితో పాటు, అదనంగా రూ.20,000 దాణా కోసం ఖర్చయినప్పటికీ, మొత్తం ఖర్చు 40,000 తీసివేయగా రూ.60,000 నికర లాభం ఉంటుంది.

Chicken Farming

Chicken Farming

వ్యాధి నివారణ, నిర్వహణ:

కోడి పెంపకంలో రోగాల బెడద సహజమని, ఇది వ్యాపారంలో ఒక రిస్క్. అన్ని వ్యాపారాలలో రిస్క్ ఉంటుందని, రిస్క్ తీసుకుంటేనే జీవితంలో ముందుకు వెళ్లగలమ నిపుణులు సూచిస్తున్నారు. కోడి పిల్లల బ్రూడింగ్‌కు ప్రత్యేక శ్రద్ధ అవసరం. కోడి పిల్లలు ఉండే గదిలో నాలుగు 200 వాట్ల ఎర్ర బల్బులను అమర్చి 34-36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను నిర్వహించాలి. దీనివల్ల పిల్లలు చురుకుగా ఉంటాయి. అనారోగ్యం పాలవవు. వర్షం నీరు లోపలికి రాకుండా జాగ్రత్త పడాలి.

ఇది కూడా చదవండి: Multibagger: కలిసొచ్చిన కాలం.. రూ. 1 లక్ష పెట్టుబడి 22 నెలల్లోనే రూ.6 కోట్లు..!

పిల్లలకు స్టార్టర్ ఫీడ్ ఇవ్వాలి. ఇది మందు కాదు, జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జలు, సోయాబీన్ వంటి ధాన్యాలను సరైన మోతాదులో కలిపి తయారుచేసిన దాణా. ఇది పిల్లల జీర్ణక్రియకు సహాయపడి, వేగంగా పెరగడానికి దోహదపడుతుంది. బియ్యపు నూకలు ఇస్తే పిల్లలకు విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. బలవర్థకమైన టానిక్‌లైన బ్రూటాన్‌ను నీటిలో కలిపి ఇవ్వాలి.

టీకాలు, మందులు:

వ్యాధులను నివారించడానికి టీకాలు తప్పనిసరి.

  • 5వ రోజున: కొక్కెర రోగం (న్యూకాసిల్ డిసీజ్/రాణీఖేత్) రాకుండా లాసోటా టీకా.
  • 14వ రోజున: గంబోరో వ్యాధి నివారణకు గంబోరో వ్యాక్సిన్.
  • 35వ రోజున: మశూచి (ఫౌల్ పాక్స్) రాకుండా ఫౌల్ పాక్స్ వ్యాక్సిన్.
  • వ్యాక్సిన్‌లు ఇచ్చినట్లయితే వ్యాధి వచ్చినా పిల్లల మరణాల రేటు తగ్గుతుందంటున్నారు కోళ్ల పెంపకందారులు. వ్యాధి సోకిన పిల్లలను వెంటనే మంద నుండి వేరుచేసి, లెక్సిన్ పౌడర్, టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్, మారిక్విన్ వంటి మందులను వాడాలి. అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా ఇతర పక్షుల (కాకులు, పిచ్చుకలు) నుండి కూడా కోళ్లను రక్షించుకోవాలి. అనారోగ్యంతో ఉన్న కోడిని వెంటనే గుర్తించి వేరుచేయడం ద్వారా మిగిలిన మందను కాపాడవచ్చు. ఈ వ్యాపారం సులభం కాకపోయినా సరైన ప్రణాళికల ద్వారా విజయవంతం కావచ్చంటున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఈ సమాచారం మొత్తం నాటు కోళ్ల పెంపకందారుల నుంచి సేకరించిన సమాచారం. ఏవైనా సందేహాలు నిపుణులను సంప్రదించండి.)

ఇది కూడా చదవండి: Rental Agreement: రెంటల్ అగ్రిమెంట్ 11 నెలలకే ఎందుకు చేస్తారు? అసలు సీక్రెట్‌ ఇదే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *