బరువు తగ్గాలంటే ఉదయాన్నే ఇది ఒక్క గ్లాస్‌ తాగితే చాలు..ఫిట్‌గా స్లిమ్‌గా అవుతారు పక్కా..!

బరువు తగ్గాలంటే ఉదయాన్నే ఇది ఒక్క గ్లాస్‌ తాగితే చాలు..ఫిట్‌గా స్లిమ్‌గా అవుతారు పక్కా..!


బరువు తగ్గాలంటే ఉదయాన్నే ఇది ఒక్క గ్లాస్‌ తాగితే చాలు..ఫిట్‌గా స్లిమ్‌గా అవుతారు పక్కా..!

మీరు కూడా ఎప్పటినుంచో సన్నగా తయారవ్వాలనుకుంటున్నారా? అయితే, ఇది మీకోసమే..నిజానికి బరువు తగ్గాలనుకునేవారు చాలా మంది గంటల తరబడి వ్యాయామాలు చేస్తుంటారు. రకరకాల డైట్‌ప్లాన్‌ ఫాలో అవుతుంటారు. విపరీతంగా కడుపు మాడ్చేసుకుంటారు. కొంతమంది మూడు నుంచి నాలుగు గంటల పాటు వ్యాయామాలు చేసినప్పటికీ.. ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారు. బరువు తగ్గడానికి వ్యాయామాలతో పాటు సరైన పానీయాలు కూడా అవసరమని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఊబకాయం అనేది ఒక వ్యక్తికి మాత్రమే వచ్చే వ్యాధి కాదు. ఇది ప్రపంచవ్యాప్త అంటువ్యాధిగా మారింది. WHO ప్రకారం, 2023 నాటికి, ప్రపంచంలో దాదాపు 1 బిలియన్ మంది ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారు. WHO ఈ వ్యాధిని అంటువ్యాధి కాని వ్యాధిగా గుర్తించింది. శరీర కార్యకలాపాలు లేకపోవడం ఈ వ్యాధికి ప్రధాన కారణం. ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చుని పనిచేయటం, మొబైల్, టీవీతో గడపటం వల్ల ఈ సమస్య వేగంగా పెరిగిపోతోంది. అయితే, దీనికి పరిష్కారం మన వంటింట్లోనే ఉందని నిపుణులు చెబుతున్నారు.

నిజానికి బరువు తగ్గడానికి పుదీనా రసం క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఉదయాన్నే దీనిని తాగడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. సింపుల్‌గా బరువు తగ్గాలనుకుంటే.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ రసం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రసం ఉదయాన్నే తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వేగవంతమై.. శరీరంలో పెరిగిన అదనపు కొవ్వు కూడా తగ్గుతుంది. అంతేకాదు.. పుదీనా ఆకు కషాయంలో చక్కెర వుండదు, చాలా తక్కువ కేలరీలు ఉంటాయి.

పుదీనా నీరు తాగుతుంటే మీజిల్స్, రొమ్ము క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. పుదీనా ఆకు కషాయం మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. పుదీనా నీటిని తాగితే నోటి దుర్వాసన పోగొడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *