పట్టపగలు రైలు పట్టాలపై వింత ఆకారం.. స్థానికుల అరుపులు, కేకలు.. ఆగిపోయిన రైళ్లు..! కట్‌చేస్తే..

పట్టపగలు రైలు పట్టాలపై వింత ఆకారం.. స్థానికుల అరుపులు, కేకలు.. ఆగిపోయిన రైళ్లు..! కట్‌చేస్తే..


మన దేశంలో తాగుబోతులకు కొదువ లేదు. ఇక తాగిన మైకంలో వారు చేసే హంగామా మామూలుగా ఉండదు. కొందరు తాగిన మైకంలో ఎప్పుడు ఏం చేస్తారో అర్థం కాదు. ఫుల్ గా తాగడం, ఎక్కడపడితే అక్కడ రోడ్లపై పడుకోవడం, చివరకు చెరువుల్లో కూడా నిద్రపోయిన ఘటనలు చాలా చూశాం. మద్యం ప్రజల మనస్సులను ఎలా పాడు చేస్తుందో చెప్పడానికి ఒక స్పష్టమైన ఉదాహరణ ఈ వీడియోలో చూడవచ్చు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక తాగుబోతు యువకుడు రైల్వే ట్రాక్‌ను మంచం అనుకున్నాడో ఏమోగానీ, అక్కడే గుర్రుపెట్టి హాయిగా నిద్రపోయాడు. తాగుబోతు చేసిన పనిని అక్కడి వారంతా ఫోటోలు, వీడియోలు తీయతటం మొదలుపెట్టారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియో ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ టెర్మినస్ (CST) స్టేషన్‌లోని హార్బర్ లైన్ నుండి వచ్చినట్లుగా తెలిసింది. స్థానిక రైలు హాల్ట్ లైన్‌లోని స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 1 ట్రాక్‌లపై తాగిన మత్తులో అక్కడ చెత్త సేకరించే వ్యక్తి నిద్రపోతూ కనిపించింది. తాగిన మత్తులో ఉన్న యువకుడు పట్టాలపై ప్రశాంతంగా నిద్రపోవటం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అంతలోనే వెనుక నుండి ఒక రైలు కదులుతూ నెమ్మదిగా ఆ యువకుడి దగ్గరికి వస్తోంది. రైలు రావడం చూసి, ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న వ్యక్తులు సదరు తాగుబోతును నిద్ర నుండి లేపడానికి కేకలు వేస్తూ చేతులు ఊపుతూ కనిపించారు. కానీ, మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు మాత్రం చీమ కుట్టినట్టుగా కూడా కదల్లేదు.

ఇవి కూడా చదవండి

పట్టాలపై నెమ్మదిగా కదులుతున్న రైలులోని స్థానిక మోటార్‌మ్యాన్, తాగిన మత్తులో ఉన్న వ్యక్తిని మేల్కొలపడానికి బిగ్గరగా హారన్ మోపాడు. అయితే, అతను పట్టాల నుండి కదలడానికి నిరాకరించి గాఢంగా నిద్రపోతూనే ఉన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే, అక్కడ ఉన్న రైల్వే పోలీసులు (GRP) అతన్ని పట్టాల నుండి తొలగించారు. తాగిన మత్తులో ఉన్న వ్యక్తి కారణంగా అరగంట పాటు సెంట్రల్ లోకల్ సర్వీసులకు అంతరాయం కలిగించింది. దీనివల్ల వేలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. నిందితుడు తాగిన మత్తులో ఉన్న వ్యక్తిపై రైల్వే చట్టం కింద కేసు నమోదు చేయబడింది. ప్రస్తుతం, ఈ వీడియో ప్రతి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో విస్తృతంగా షేర్ అవుతోంది. సోషల్ మీడియా సైట్ Xలో పోస్ట్ చేయబడిన @Nalanda_index అనే ఖాతా ద్వారా మన ముందుకు వచ్చింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *