Kova Bun Ali: కోవా బన్‌ వలికి.. మెగా సపోర్ట్‌

Kova Bun Ali: కోవా బన్‌ వలికి.. మెగా సపోర్ట్‌


ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కోవా బన్‌ చుట్టే తిరుగుతోంది. బీబీసీ మొదలు.. ఏపీలోని రాజకీయపార్టీలు కూడా కోవా బన్ గురించే మాట్లాడుతున్నాయి. ఈ క్రమంలోనే జనసన పార్టీ నేత నాగబాబు.. కోవాబన్‌ మ్యాటర్‌లోకి ఎంటర్‌ అవడం.. బాధితున్ని కలవడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది. కర్నూలు జిల్లా నంధ్యాల వైపే అందరూ చూసేలా చేస్తోంది. ఇక అసలు విషయం ఏంటంటే.. ! కర్నూలుకు చెందిన ‘వలీ’.. కోవా బన్ను అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటీవల జరిగిన మేడారం జాతరలోనూ ఓ చిన్న బండిపై కోవా బన్ను అమ్ముతూ కొందరు యూట్యూబర్ల కంట పడ్డాడు. అయితే వారు వలితో ప్రవర్తించిన తీరు , కోవా బన్ను మీద అనుమానాలు రేకెత్తించిలా వ్యవహరించిన తీరు నెట్టింట బాగా వైరలయ్యింది. లైకులు, షేర్ల కోసం యూట్యూబ్ ఛానెల్స్ ఓ చిరు వ్యాపారిని ఇబ్బందులు పెట్టడం తగదంటూ ఆ యూబ్యూటర్లపై మండిపడ్డారు నెటిజన్లు. మరోవైపు వలీకి కూడా భారీగానే మద్దతు లభించింది. నారా లోకేశ్, పరిటాల లోకేశ్, అసదుద్దీన్ ఒవైసీ వంటి రాజకీయ, సినీ ప్రముఖులు వలికి మద్దతు పలుకుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తాజాగా ఏపీ ఎమ్మెల్సీ, ప్రముఖ సినీ నటుడు నాగబాబు వలిని కలిశారు. అతనికి ధైర్యం చెప్పి ఆర్థిక సాయం అందించారు. చేతనైతే చిరు వ్యాపారులకు అండగా నిలవాలని, అంతే కానీ వారి పొట్ట కొట్టొద్దని హితవు పలికారు. “చిరువ్యాపారస్తులకు కూటమి ప్రభుత్వం భరోసాగా ఉంటుంది. పొట్టకూటి కోసం, కుటుంబ పోషణ కోసం కోవా బన్ను అమ్ముకుంటున్న సాధారణ పౌరుడుని కొందరు భయభ్రాంతులకు గురిచేయడం మంచి పరిణామం కాదు. ఈ సంఘటన తర్వాత చాలామంది చిరు వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సంఘటన కారణంగా శివరాత్రికి ‘వలి’ వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆ వ్యక్తి బాధను అర్థం చేసుకుని వ్యక్తిగతంగా రూ. 25 వేలు ఆర్థిక సహాయం అందించాం. చిరువ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించడానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీలు ఉన్నాయి. ఏదైనా సందేహం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించవచ్చు. వలి లాంటి చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది.” అంటూ నాగబాబు తన పోస్టులో రాసుకొచ్చారు. అంతేకాదు ఈ సంఘటనను మతం కోణంలో చూడొద్దని నాగబాబు కోరారు. తక్కువ లాభంతో ఎక్కువ అమ్మకాలు చేస్తూ రోజువారీ ఖర్చులు వెళ్లతీసుకోవడం చిరువ్యాపారుల లక్ష్యమని.. వివరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జూ పార్క్‌లో హిప్పోల బర్త్ డే సెలబ్రేషన్స్

పైకి మాత్రం కుటీర పరిశ్రమ.. లోపలే ఉంది అసలు రహస్యం

ఇసుకతో ప్రాణం పోశారు !! ఈ శిల్పాన్ని చూస్తే కళ్ళు తిప్పుకోలేరు !!

రాత్రి గుడారాల్లో.. పగలు కార్లలో.. ఐడియా అదిరింది

అభ్యర్ధుల ఓటమితో.. కసితో దాడి! గిఫ్ట్‌లు తిరిగి ఇచ్చేసిన ఓటర్లు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *