
పసిడి ధరలు మళ్లీ స్వల్పంగా తగ్గాయి. ఈ వారం మొదలు నుంచి గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గుముఖం పడిపోతున్నాయి. సోమవారం బంగారం ధర ఏకంగా రూ.1300 మేర తగ్గగా.. మంగళవారం కూడా స్వల్పంగా పడిపోయాయి. గోల్డ్ ధరలు పతనమవుతుండటంతో కొనుగోలుదారులు కూడా ఊరట చెందుతున్నారు. త్వరలో పెళ్లిళ్ల సీజన్ మొదలుకానుంది. ఈ క్రమంలో బంగారం, వెండి రేట్లు తగ్గుతుండటం కాస్త ఉపశమనం లభిస్తోంది. డాలర్ మళ్లీ బలపడుతుండటంతో బంగారం ధరలు పడిపోతున్నట్లు బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. అయితే ఈ పతనం ఎంతకాలం ఉంటుందనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. మంగళవారం దేశంలోని వివిధ ప్రాంతాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
ఇవాల్టీ గోల్డ్ రేట్లు ఇవే..
-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,56,430గా కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,56,440గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,390 వద్ద కొనసాగుతోంది. సోమవారం ఈ ధర రూ.1,43,400గా ఉంది.
-విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,56,430 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,390గా ఉంది
-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,57,520 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,44,390గా ఉంది.
-బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,430 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,43,390గా ఉంది.
-ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,56,580గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,540 వద్ద కొనసాగుతోంది
వెండి రేట్లు ఇవే..
-హైదరాబాద్‌లో మంగళవారం కేజీ వెండి ధర రూ.2,67,900గా ఉంది. నిన్న ఈ రేటు రూ.2,68,000 వద్ద కొనసాగుతోంది
-చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,64,900 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ రేటు రూ.2,65,000గా ఉంది.
-బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2,67,900గా ఉండగా.. సోమవారం రూ.2,68,000 వద్ద కొనసాగుతోంది
-ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,67,900 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ రేటు రూ.2,68,000గా ఉంది.