JEE Main 2026 Toppers: జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. ఏకంగా ముగ్గురికి 100 పర్సంటైల్‌!

JEE Main 2026 Toppers: జేఈఈ మెయిన్‌ ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. ఏకంగా ముగ్గురికి 100 పర్సంటైల్‌!


హైదరాబాద్, ఫిబ్రవరి 16: జేఈఈ మెయిన్స్‌ 2026 తొలి విడత ఫలితాలు సోమవారం సాయంత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 12 మంది వంద పర్సంటైల్‌ సాధించగా.. ఇందులో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉండటం విశేషం. వీరిలో ఇద్దరు ఏపీకి చెందిన విద్యార్థులు ఉండగా, తెలంగాణకు చెందిన ఒక విద్యార్థి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి శరత్‌ మహేశ్వరి, నరేంద్ర, మోహిత్‌ అనే ముగ్గురు తెలుగు విద్యార్థులు 100 పర్సెంటైల్‌ సాధించి సత్తా చాటారు. ఓపెన్‌ కేటగిరిలో పసల మోహిత్‌ 100 పర్సెంటైల్‌ సాధించగా, ఓబీసీ కేటగిరిలో నరేంద్ర బాబు టాపర్‌గా నిలిచాడు.

జేఈఈ మెయిన్స్‌ 2026 ఫలితాల్లో 100 పర్సెంటైల్‌ సాధించిన టాపర్స్ ఫుల్‌ లిస్ట్‌ ఇదే

  • శ్రేయస్‌ మిశ్రా (ఢిల్లీ)
  • నరేంద్ర బాబు (ఆంధ్రప్రదేశ్‌)
  • శుభమ్‌ కుమార్‌ (బీహార్‌)
  • కబీర్‌ చిల్లర్‌ (రాజస్తాన్‌)
  • చిరాన్‌జిబ్‌ కార్‌ (రాజస్తాన్‌)
  • భవేశ్‌ పత్రా (ఒడిశా)
  • అనయ్‌ జైన్‌ (హర్యానా)
  • అర్నవ్‌ గౌతమ్‌ (రాజస్తాన్‌)
  • పసల మోహిత్‌ (ఆంధ్రప్రదేశ్‌)
  • మాధవ్‌ విరాదియా (మహారాష్ట్ర)
  • పురోహిత్‌ నిమయ్‌ (గుజరాత్‌)
  • వివన్‌ శరద్‌ మహీశ్వరి (తెలంగాణ)

కాగా జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్‌ పేపర్‌ 1 పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు 13.50 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో దాదాపు 95 శాతం మంది పరీక్షలు రాశారు. జనవరి 29న జరిగిన పేపర్ 2 పరీక్ష ఫలితాలు త్వరలోనే విడుదల చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *