ముఖం పాలిపోవడం, దవడ కండరాలు బిగుసుకుపోవడం వంటి చిన్న చిన్న మార్పుల వెనుక పెద్ద ఆరోగ్య సమస్యే ఉండవచ్చు. ఆ ఖనిజం మరేదో కాదు.. మెగ్నీషియం. మెగ్నీషియం లోపం వల్ల ముఖంపై కనిపించే సంకేతాలేంటో తెలుసుకుందాం..
- సాధారణంగా అలసట, ఒత్తిడి లేదా ఎక్కువ కాఫీ తాగడం వల్ల కళ్లు అదురుతుంటాయి. కానీ ఇది తరచుగా జరుగుతుంటే మెగ్నీషియం లోపం కారణం కావచ్చు. మెగ్నీషియం నరాలు మరియు కండరాల మధ్య సంబంధాన్ని స్థిరంగా ఉంచుతుంది. ఇది తగ్గినప్పుడు కళ్ల చుట్టూ ఉండే చిన్న చిన్న కండరాలు స్పేమ్స్ కు గురవుతాయి.
- ఎంత నిద్రపోయినా కళ్ల కింద నలుపు తగ్గడం లేదంటే అది కేవలం కాస్మెటిక్ సమస్య కాదు. మెగ్నీషియం లోపం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు, దీనివల్ల కళ్ల కింద చర్మం పల్చబడి రక్తనాళాలు బయటకు కనిపిస్తాయి. ఫలితంగా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. కేవలం క్రీములు రాస్తే ఇది తగ్గదు, ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిందే.
- ఉదయాన్నే నిద్రలేవగానే ముఖం, కళ్లు ఉబ్బినట్లు అనిపిస్తున్నాయా? అయితే శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ తప్పిందని అర్థం. మెగ్నీషియం వాపును తగ్గిస్తుంది. ఇది లోపించినప్పుడు ముఖం ఉబ్బుగా, చర్మం పొడిగా మరియు నిర్జీవంగా కనిపిస్తుంది. అలాగే దవడ కండరాలు బిగుసుకుపోవడం, పెదవుల దగ్గర అదురు రావడం వంటివి కూడా దీని లక్షణాలే.
- డెర్మటాలజీ నిపుణులు చెబుతున్న ప్రకారం.. మెగ్నీషియం, నిద్ర, జీర్ణక్రియ కలిస్తేనే అందమైన చర్మం సాధ్యం. మెగ్నీషియం వల్ల గాఢ నిద్ర పడుతుంది, ఆ సమయంలోనే చర్మం తనను తాను బాగు చేసుకుని కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది లోపిస్తే చర్మం త్వరగా ముడతలు పడటం, మొటిమలు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
- మెగ్నీషియం లోపాన్ని అధిగమించడానికి మన భారతీయ ఆహారంలో లభించే పాలకూర, గుమ్మడి గింజలు, బాదం, అరటిపండ్లు, తృణధాన్యాలు మరియు పప్పు దినుసులను డైట్‌లో చేర్చుకోవాలి. సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ సలహాతో మెగ్నీషియం గ్లైసినేట్ వంటి సప్లిమెంట్లు వాడవచ్చు.
- మెగ్నీషియం లోపం అనేది నిశ్శబ్దంగా వచ్చే సమస్య. మీ ముఖం ఇచ్చే ఈ చిన్న చిన్న సంకేతాలను గమనించడం ద్వారా పెద్ద ఆరోగ్య సమస్యలను ముందే నివారించవచ్చు.