నెలకు రూ.30,000 జీతం పొందుతున్న ఉద్యోగి ప్రతి నెలా రూ.10,000 పొదుపు చేయడం అసాధ్యం కాదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. సరైన బడ్జెట్ కట్టుదిట్టంగా పాటిస్తే ఇది సాధ్యమవుతుందని వారు చెబుతున్నారు. అయితే వారి ఖర్చులు ఎలా ఉండాలి? దేనిపై ఎంత ఖర్చు చేస్తే వారికి నెలకు రూ.10 వేల పొదుపు సాధ్యం అవుతుందో ఇప్పుడు చూద్దాం..
- మొత్తం జీతం: రూ.30,000
- లక్ష్య పొదుపు: రూ.10,000
- మిగిలే ఖర్చు మొత్తం: రూ.20,000
ఖర్చుల విభజన
- ఇల్లు అద్దె / నివాస ఖర్చు – రూ.6,000
- ఆహారం, కిరాణా – రూ.4,000
- రవాణా – రూ.2,000
- విద్యుత్, మొబైల్, ఇంటర్నెట్ – రూ.1,500
- కుటుంబ అవసరాలు – రూ.3,000
- రూ.వ్యక్తిగత ఖర్చులు, వినోదం – రూ.1,500
- ఎమర్జెన్సీ ఫండ్, వైద్య ఖర్చులు – రూ.2,000
ఈ మొత్తం ఖర్చు వచ్చేసి నెలకు రూ.20 వేలు అవుతుంది. మిగతా రూ.10 వేలు మీరు పొదుపు చేయొచ్చు. వాటిని ప్రతి నెలా చిట్టీలు కట్టి, లేదా సిప్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దాంతో మీ పొదుపు డబ్బు మరింత పెరుగుతుంది.
పొదుపు ఎలా పెట్టుబడిగా మార్చాలి?
నిపుణుల సూచనల ప్రకారం.. అత్యవసర నిధిగా కనీసం 3–6 నెలల ఖర్చుల సమానంగా బ్యాంక్ సేవింగ్స్‌లో ఉంచాలి. మిగిలిన మొత్తాన్ని రికరింగ్ డిపాజిట్ (RD) లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా పెట్టుబడి చేయవచ్చు. ఆరోగ్య బీమా తీసుకోవడం కూడా దీర్ఘకాల భద్రతకు మంచిది.
ఖర్చులను నియంత్రించేందుకు చిట్కాలు
- అవసరం లేని సబ్‌స్క్రిప్షన్లు రద్దు చేయాలి
- బయట భోజనం తగ్గించాలి
- క్రెడిట్ కార్డు వినియోగాన్ని నియంత్రించాలి
- మొదట పొదుపు, తర్వాత ఖర్చు అనే నియమాన్ని కచ్చితంగా పాటించాలి.