AI Impact Summit 2026: వికసిత్‌ భారత్ వైపు మరో అడుగు.. ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పోను ప్రారంభించిన ప్రధాని మోదీ

AI Impact Summit 2026: వికసిత్‌ భారత్ వైపు మరో అడుగు.. ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పోను ప్రారంభించిన ప్రధాని మోదీ


ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ అనేది టెక్నాలజీ రంగంలో ఒక ముళ్ల కిరీటం లాంటిదని, భరించడం కష్టమని ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. ఉప్పెనలా ముంచుకొస్తున్న ఏఐ.. మనల్ని ముంచేదా తేల్చేదా.. ఈ మహా ముప్పు నుంచి తప్పించుకోవాలా లేక, ఆ సమస్యనే ఒక అవకాశంగా తీసుకోవాలా? అన్నీ చిక్కుప్రశ్నలే. అందుకే, రండి మాట్లాడుకుందాం.. AI అనే రిస్కీ గేమ్‌ని సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా ఎలా ఆడాలో నేర్చుకుందాం… అని పిలుపునిస్తోంది ఇండియా.. ఈ క్రమంలో మోదీ సర్కార్ చెబుతూ వస్తున్న వికసిత్‌ భారత్ వైపు మరో అడుగు పడింది. ఇది ప్రపంచస్థాయి సాంకేతిక విప్లవం. ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ ఎక్స్‌పో 2026… ఢిల్లీలోని భారత్‌ మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026, ఫిబ్రవరి 16 నుండి 20 వరకు ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌తో పాటు జరగనుంది. ‘‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ’’.. థీమ్ తో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు.

ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పో ప్రారంభం అనంతరం.. ప్రధాని మోదీ.. ఏఐ స్టాళ్లను పరిశీలించారు.

ఏఐ ఉప్పెనపై ఉన్న సంశయాల్ని డిలీట్ చేయడం ఎలా, కృత్రిమ మేధ అంశంలో భారత్‌ను లీడర్‌గా చేయడం ఎలా? ఇదే ఎజెండా. వెల్‌ఫేర్ ఫర్ ఆల్.. హ్యాపీనెస్ ఫర్ ఆల్.. అందరికీ సంక్షేమం, అందరికీ ఆనందం… ఇదీ సమిట్ కోర్ థీమ్‌.

>>ఐదు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌పోలో జపాన్‌, రష్యా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీతో పాటు మొత్తం 13 దేశాల పెవిలియన్లు ఏర్పాటుచేశారు.

>>దేశవ్యాప్తంగా 600లకు పైగా హైపొటెన్షియల్‌ స్టార్టప్‌లు తమ సరికొత్త ఆవిష్కరణలను ప్రదర్శించబోతున్నాయి. 300లకు పైగా ఎగ్జిబిషన్లు, 500కు పైగా లైవ్‌ డెమోలు ఏర్పాటు చేశారు.

>>శ్యామ్‌ ఆల్ట్‌మాన్‌, బిల్‌ గేట్స్‌, డేరియో అముదెయ్‌ లాంటి 40 మంది వరల్డ్‌క్లాస్ సీఈవోలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు.

గ్లోబల్ సౌత్‌లో నిర్వహిస్తున్న మొట్టమొదటి ప్రపంచస్థాయి ఏఐ సమిట్‌ మన దేశంలో జరుగుతోంది. ఇది మనకు గర్వకారణం. ఇంతకీ, ఈ సమిట్ ద్వారా ఏమేం ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చు..? లెటజ్‌సీ.

>>పాలసీల్ని, ప్రాక్టీస్‌ని రిసెర్చ్‌తో లింకప్ చెయ్యడం.. ఏఐ రెగ్యులేషన్, ఇన్నోవేషన్‌కి సంబంధించి ఫ్యూచర్ పాలసీల్ని, వర్క్‌ఫోర్స్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ని షేపప్ చెయ్యడం. పాలసీ మేకింగ్‌నీ, వాటి అప్లికేషన్‌నీ అనుసంధానిస్తుంది.

>>హోమ్‌-గ్రోన్ ఏఐ మోడల్స్‌ని అభివృద్ధి ఇప్పటికే జరుగుతోంది. మన పౌర సేవలకు ఉపయోగపడేలా దేశీయ భాషల్లో ఏఐ మోడల్స్‌ని ఎలా పెంపొందించాలో డిస్కస్ చేస్తారు.

>>AI మీద విశ్వసనీయత, సేఫ్టీ ఎంత మాత్రం? పారిశ్రామికంగా ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఎలా ఉండబోతోంది..? ఉపాధికల్పన తగ్గుతుందా పెరుగుతుందా? వీటన్నిటిపై ఒక అంచనా ఇస్తుంది.

>>అభివృద్ధి చెందుతున్న దేశాల్ని ఏఐ ఎంతమేరకు ప్రభావితం చేస్తుంది..? ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకోకపోతే చెల్లించుకోబోయే మూల్యం ఏంటి? ఈ సదస్సులో క్లారిటీ వస్తుంది.

>>రాబోయే ఐదేళ్లలో భారత ఏఐ మార్కెట్‌ సామర్థ్యం 17 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. అభివృద్ధి చెందిన దేశాలు కూడా AI విషయంలో భారత్‌ వైపు చూసేలా స్ట్రాటజీల్ని షేపౌట్ చేస్తారు.

ప్రపంచానికి ఎక్కువ వర్క్‌ఫోర్స్‌నిచ్చే దేశం మనదే. పైగా, కొత్త టెక్నాలజీని ప్రోత్సహించడంలో మనమే ముందుంటాం. మరి.. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌ విషయంలో మాత్రం ఎందుకు తగ్గుతాం? అందుకే, ఏఐకి నెక్ట్స్ చాప్టర్ ఇండియాదే.. ఆంటున్నారు గ్లోబల్ టెక్నో స్టార్స్.

ముందస్తుగా ఇండియాకు కాంప్లిమెంట్స్..

ఏఐ టెక్నాలజీ ద్వారా వచ్చే బెనిఫిట్స్‌ని అన్‌లాక్ చెయ్యడానికి ఢిల్లీ సదస్సు ఒక అద్భుతమైన అవకాశం. – డేవిడ్ ల్యామీ, యూకే డిప్యూటీ ప్రైమ్‌ మినిస్టర్

కేవలం వాడుకలోనే కాదు, AI టెక్నాలజీలో లీడర్‌గా ఎదగడానికి ఇండియాకు సత్తా ఉంది. ఆ దేశంలో పటిష్టమైన వర్క్‌ఫోర్స్ ఉంది. – ఆల్ట్‌మెన్‌, open AI CEO

గతంలో ఈయనే ఇండియాను హోప్‌లెస్ అని కామెంట్ చేశారు.

కలలు కనడమే కాదు, సాకారం చేసుకోవడంలో ఇండియాకొక చరిత్ర ఉంది. AI రెవెల్యూషన్‌ని కూడా చక్కగా మేనేజ్ చెయ్యగలదు. -శంతను నారాయణ్, ఎడోబ్ సీఈఓ

సాంకేతికపరంగా రాబోయే దశాబ్దం ఎలా ఉండబోతోందో చెప్పడానికి ఢిల్లీ ఏఐ సదస్సు ఒక నిదర్శనం కాబోతోంది. -జూలీ స్వీట్, యాక్సెంచర్ సీఈఓ

ఇంకా క్వాల్‌కమ్, అమెజాన్, గూగుల్ పెద్దలందరూ ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సదస్సుపై తమతమ ఫ్యూచరిస్టిక్ థాట్స్‌ని చెప్పుకున్నారు. టోటల్‌గా ఇండియా ఈజ్‌ ది బెస్ట్ ఎట్ AI అనేది గట్టిగా వినిపిస్తున్న గ్లోబల్ టాక్. కానీ, ఐటీ మీద డిపెండై మన దేశంలో దాదాపు 58 లక్షల మంది బతుకున్నారు. ఏఐ ఉప్పెనతో 75 శాతం మంది జిందగీలు చితికిపోతాయని ఒక ఫికర్ కూడా ఉంది. ఇటువంటి అనేక ఛాలెంజెస్‌ గురించి లోతుగా చర్చిచబోతోంది ఢిల్లీ ఏఐ ఇంపార్ట్ సమిట్.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *