పాలు: కాకరకాయలు తినడం వల్ల మనకు ఆనేక రకాల ప్రయోజనాలు ఉన్నప్పటికీ ఈ పదార్థాలతో కలిపి తీసుకోవడం అస్సలు మంచిది కాదు. చాలా మంది తిన్న వెంటనే పాలు తాగే అలవాటు ఉంటుంది. కానీ మీరు భోజనంలో కాకరకాయలు తింటే ఆ వెంటనే పాలు తాగడం మానేయండి. ఈ రెండు పదార్థాల కలయిక జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఇలా తినడం ద్వారా కొంతమందిలో ఉబ్బరం, గుండెల్లో మంట లేదా మలబద్ధకం వంటి సమస్యలు పెరగవచ్చు. అందువల్ల, కాకరకాయ తిన్న తర్వాత పాటు తాగడం ఆపేయండి.
పెరుగు: చాలా మంది అన్నంలో కర్నీతో పాటు పెరుగును కలుపుకొని తింటారు. ఒక వేళ మీరు భోజనంలోకి కాకరకాయ కర్నీని తీసుకుంటే అలాంటి సందర్భాల్లో పెరుగును అస్సలూ జోడించుకోవద్దు. ఎందుకంటే ఈ కలయిక కొంతమందిలో చర్మ సమస్యలు లేదా అలెర్జీ లక్షణాలను కలిగిస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారు దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ముల్లంగి: అలాగే ముల్లంగిని కూడా ఎప్పుడూ కాకరకాయతో కలిపి తీసుకోకండి. ఈ రెండింటి లక్షణాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి వీటిని కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపులో అసౌకర్యం కలగవచ్చు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఉన్నవారు కాకరకాయల జోలికి అస్సలు వెళ్లకండి. ఇవే కాదు భోజనం చేసిన వెంటనే చాలా మంది కిల్లీ తినే అలావాటు ఉంటుంది. కానీ కాకరకాయలు తిన్నప్పుడు తమలపాకులను అస్సలు తినొద్దు. ఇది జీర్ణ సమస్యలకు దారి తీయవచ్చు.
మామిడి: అయితే కొంత మంది భోజనంలోకి ఆవకాయతో పాటు ఇతర కూరలు వేసుకొని తింటారు. అయితే మీరు కాకరకాయతో భోజనం చేస్తున్నట్టు అయితే అప్పుడు మామిడిని అస్సలూ తీసుకోవద్దు.ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల కొంతమందిలో అసిడిటీ, గుండెల్లో మంట, వికారం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, ఈ ఆహారాలను వేర్వేరు సమయాల్లో తినడం మంచిది.
కాకరకాయ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. వాటిని పొందాలంటే.. దాన్ని ఎలా మనం తీసుకుంటున్నామనేది ముఖ్యం. కాకరకాయను సరైన క్రమంలో తీసుకోవడం ద్వారా మీరు దాని పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు. ( Note: ఈ వ్యాసంలో పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి)




