శ్రీశైలం ఘాట్ రోడ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు దోర్నాల అదుపుతప్పి బోల్తా పడింది. ఆ పక్కనే భారీ గుంత ఉండడంతో బస్సు అమాంతం ఆ గుంతలోకి ఒరిగిపోయింది. గమనించిన స్థానిక వాహన దారులు అప్రమత్తమై బస్సులోఉన్న ప్రయాణికులందరినీ కిందకు దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది బస్సును తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
వీడియో చూడండి..
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.