చాక్‌పీస్‌పై సూక్ష్మ శివలింగం.. చూపరులను మంత్రముగ్ధులను చేస్తుందిగా

చాక్‌పీస్‌పై సూక్ష్మ శివలింగం.. చూపరులను మంత్రముగ్ధులను చేస్తుందిగా


మహాశివరాత్రి వేళ దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. పుణ్యక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. లయకారుడైన పరమేశ్వరుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ ఆధ్యాత్మికతను మరింత రెట్టింపు చేస్తూ ఓ భక్తుడు తన భక్తిని కళాత్మకంగా చాటుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో భక్తికి భాష్యం చెబుతూ, కళకు ప్రాణం పోస్తూ.. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు చాక్ పీస్‌పై అతిసూక్ష్మ శివలింగాన్ని చెక్కి అందరినీ అబ్బురపరిచాడు. కాటారం మండల కేంద్రంలోని గిరిజన బాలుర కళాశాలలో డ్రాయింగ్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న ఆడెపు రజనీకాంత్, శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తనలోని సృజనాత్మకతకు పదును పెట్టారు. కేవలం ఒక గుండుపిన్ను సాయంతో, గంటన్నర పాటు నిశితంగా శ్రమించి, కేవలం 1.3 సెంటీమీటర్ల ఎత్తు, 1.5 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన అత్యంత సూక్ష్మ శివలింగాన్ని చాక్ పీస్‌పై రూపొందించారు. కంటికి చిన్నగా కనిపించినా, ఆ శివలింగం ఆకృతిలో చూపిన స్పష్టత భక్తులను, చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది. రజనీకాంత్ కి ఇటువంటి అద్భుతాలు చేయడం కొత్తేమీ కాదు. గత శివరాత్రికి ఏకంగా 109 సూక్ష్మ శివలింగాలను తయారుచేసి తన భక్తిని చాటుకున్నారు. కేవలం ఆధ్యాత్మికతలోనే కాదు, దేశభక్తిలోనూ ఆయన మేటి అని నిరూపించుకున్నారు. గతంలో ప్రపంచంలోనే అతి చిన్న జాతీయ జెండాను రూపొందించి ‘Credence Book of World Records’లో స్థానం సంపాదించి జిల్లా ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆయన రూపొందించిన ఈ ‘సూక్ష్మ శివలింగం’ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “శివుడిపై భక్తిని చాటుకోవడానికి ఆడంబరాలు అక్కర్లేదు, స్వచ్ఛమైన మనసుతో చేసే చిన్న ప్రయత్నం చాలు” అని ఈ ఉపాధ్యాయుడు చెప్పకనే చెప్పారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డ్రై క్లీనర్ మంత్లీ ఇన్‌కం.. రూ.2 లక్షలు నెట్టింట వైరల్‌గా పోస్ట్!

గిన్నిస్ రికార్డు సృష్టించిన భారీ పాము: చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే

నీళ్లా.. అని లైట్‌ తీసుకోకండి.. విషయం తెలిస్తే షాకే

అదృష్టం, ఆనందం కలిసి రావాలంటే ఇంట్లో ఈ మొక్కలు పెంచండి

అనకాపల్లి అగ్నిప్రమాదం: గూడ్స్ రోడ్డులో మహిళా సజీవ దహనం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *