తెలంగాణలోని రైతన్నలకు రేవంత్ సర్కార్ మరో గుడ్‌న్యూస్ చెప్పింది. పెండింగ్‌లో ఉన్న సన్న రకం వడ్లకు ప్రభుత్వం అందిస్తున్న క్వింటాల్‌కు రూ.500 బోనస్ డబ్బులను విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పెండింగ్‌లో ఉన్న రూ. 514.36 కోట్లు విడుదల చేసేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు సిద్దమయ్యారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా సన్న రకం వడ్లు పండించిన సుమారు 2.17 లక్షల రైతులకు లబ్ధి చేకూరనుంది.
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చాక సన్న రకం వడ్లు పండించే రైతన్నలకు ప్రోత్సాహం అందించేందు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకం వడ్లను పండించే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వడాన్ని అమలు చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడం రైతుల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని మరింతగా పెంచిందని విశ్లేషకులు అంటున్నారు.
అయితే తాజాగా బకాయిల చెల్లింపునకు నిర్ణయం తీసుకున్న సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నదాతలకు అండగా ఉంటూ, వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం వరి క్వింటాల్‌పై రూ.500 బోనస్ ఇస్తున్నట్టు తెలిపారు. తాజాగా ఈ బకాయిలు చెల్లింపుతో రైతులకు ఆర్థిక ఉపశమనం లభించనుందన్నారు. అయితే ఈ బోనస్ కింద ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.1939.58 కోట్ల నిధులను విడుదల చేసినట్టు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.