
ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తుంది.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. ఇటీవల తెరకెక్కిన సినిమాలన్నీ పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేదు. అన్ని సినిమాలు మూడు నాలుగు భాషల్లో విడుదలవుతున్నాయి. ఇక సినిమాలు రీసెంట్ డేస్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు చాలానే ఉన్నాయి. కాగా కొన్ని ప్రేక్షకులను దారుణంగా నిరాశపరుస్తున్నాయి. భారీ స్టార్ కాస్ట్ ఉండి, భారీగా ప్రమోషన్స్ చేసుకున్నప్పటికీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుంటాయి. మాములుగా ఓ సినిమా డిజాస్టర్ అయ్యిందంటే కేవలం రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ ఈ డిజాస్టర్ సినిమా మాత్రం ఓటీటీలోకి రావడానికి ఏకంగా 2 ఏళ్లు పట్టింది.
ఓయమ్మో..! కుష్బూ కూతురు అందం ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు.. త్వరలోనే ఎంట్రీ
ఏజెంట్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. ఏకంగా సిక్స్ ప్యాక్ బాడీను కూడా పెంచాడు. అలాగే లాంగ్ హెయిర్ తో డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. 2023లో ఏజెంట్ సినిమా విడుదలైంది. ఇదిలా ఉంటే ఏజెంట్ సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. నెలలు గడుస్తున్నా ఆ సినిమా ఓటీటీలోకి రాలేదు.
సినిమా సెట్లో ఆ హీరోని నిజంగానే కొట్టా..! షాకింగ్ విషయం చెప్పిన నటుడు
చివరకు ఏజెంట్ సినిమా 2025 మార్చ్ 14న ఓటీటీలోకి వచ్చింది. ఏజెంట్ ఓటీటీ రిలీజ్ ఆలస్యం పై రకరకాల వార్తలు వచ్చాయి. దాదాపు 2 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. కానీ ఓటీటీలోనూ ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఏజెంట్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు అఖిల్. ఇప్పుడు లెనిన్ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా రురల్ బ్యాడ్రాప్ తో తెరకెక్కుతోందని తెలుస్తుంది. ఈ సినిమాలో భాగ్య శ్రీ హీరోయిన్ గా నటిస్తుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి