Prabhas..
రెబల్ స్టార్ ప్రభాస్ కు గాయం అయ్యిందని తెలుస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్. ఇటీవలే రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు హనురాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫౌజీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ గాయపడ్డాడని తెలుస్తుంది. సినిమా షూటింగ్ లో భాగంగా గుర్రపు స్వారీ చేస్తుండగా ఆయన కింద పడ్డారని.. చేతికి గాయమైందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ ప్రభాస్ కు గాయం అయ్యిందని తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజా సాబ్ సినిమా తర్వాత ప్రభాస్ సినిమాల స్పీడ్ పెంచారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2, ప్రశాంత్ నీల్ సలార్ 2తో పాటు హనురాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వార్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడని తెలుస్తుంది.
ఈ సినిమా షూటింగ్ కీలక గుర్రపు స్వారీ సన్నివేశం ఉందట. ఈ సన్నివేశం షూటింగ్ జరుగుతుండగా ప్రమాదవశాత్తు ప్రభాస్ కిందపడ్డారని తెలుస్తుంది. దాంతో ఆయనకు గాయాలు అయ్యాయని. అయితే చిన్నగాయమే అవ్వడంతో ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తుంది. అయితే ప్రభాస్ కు గాయం అవ్వడం గురించి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త కంగారు పడుతున్నారు.