ఐదుగురి ప్రాణాలను నిలిపిన చిన్నారి

ఐదుగురి ప్రాణాలను నిలిపిన చిన్నారి


ఫిబ్రవరి 5న కొట్టాయం నుంచి తిరువళ్ల వెళ్తుండగా ఎం.సి. రోడ్డులో అలిన్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెతో పాటు కారులో ఉన్న తల్లి, తాతయ్య, నాయనమ్మ కూడా గాయపడ్డారు. వెంటనే స్థానిక ఆసుపత్రులకు తరలించి, మెరుగైన చికిత్స కోసం ఫిబ్రవరి 7న కొచ్చిలోని అమృత ఆసుపత్రికి మార్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఫిబ్రవరి 13న చిన్నారి బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు డాక్టర్లు తెలిపారు. పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ, చిన్నారి తల్లిదండ్రులు అరుణ్ అబ్రహం, షెరిన్ ఆన్ జాన్ తమ కుమార్తె అవయవాలను దానం చేయడానికి అంగీకరించారు.వైద్యులు చిన్నారి నుంచి కాలేయం, రెండు కిడ్నీలు, గుండె కవాటం, రెండు కనుగుడ్లను సేకరించారు. కాలేయాన్ని తిరువనంతపురంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరు నెలల బాబుకు అమర్చనున్నారు. రెండు కిడ్నీలను తిరువనంతపురం మెడికల్ కాలేజీలోని శాట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో చిన్నారికి, గుండె కవాటాన్ని శ్రీ చిత్ర ఇనిస్టిట్యూట్‌కు పంపారు. కనుగుడ్లను అమృత ఆసుపత్రిలోనే ఉంచారు.

మరిన్ని వీడియోల కోసం :

వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్

ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *