కోలిఫామ్ బ్యాక్టీరియా.. మనిషి పేగులలో సాధారణంగా కనిపించే బ్యాక్టీరియా. అదే పాలలో ఉందంటే మానవ వ్యర్థాల ద్వారా పాలు కలుషితమైనట్లే అని గగ్గోలు పెడుతున్నారు కొందరు. పాకెట్ పాల పరిశుభ్రత ప్రమాణాలు, ఆరోగ్య భద్రతపై చర్చ సోషల్ మీడియా లో సాగుతోంది. ఇవి కేవలం ఆరోపణలే అని ఆ కంపెనీలు ఖండిస్తున్నాయి. తమ ఉత్పత్తులన్నీ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని కంపెనీలు ప్రకటిస్తున్నాయి. తయారీ వైఫల్యం లేదని, కానీ పంపిణీ సమయంలో కోల్డ్ చైన్‌లో ఏదైనా తప్పు జరిగే అవకాశం ఉండొచ్చంటున్నాయి. పాలు పితికే దశ నుంచి రవాణా, నిల్వ, కోల్డ్ చైన్ నిర్వహణ సమయంలో కల్తీ జరగడానికి అవకాశాలు ఎక్కువంటున్నాయి. సాధారణంగా ప్యాకెట్ పాలను పాశ్చరైజేషన్ చేస్తారు. దాంతో హానికారక బ్యాక్టీరియా తొలగిపోతుంది. ఆ తర్వాత సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయలేకపోవడంతో బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే ప్యాకెట్ పాలను మరిగించకుండా వాడకూడదు.
మరిన్ని వీడియోల కోసం :