Post Office: ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. నెలకు రూ.20 వేలు వచ్చే స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

Post Office: ఒక్కసారి ఇన్వెస్ట్‌ చేస్తే చాలు.. నెలకు రూ.20 వేలు వచ్చే స్కీమ్‌ గురించి మీకు తెలుసా?


Post Office Scheme: ఇండియన్‌ పోస్టాఫీసులలో రకరకాల స్కీమ్‌లు ఉన్నాయి. నెలనెల పెట్టుబడి పెట్టడం లేదా ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయడం లాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని పథకాలలో ఒకసారి ఇన్వెస్ట్‌ చేస్తే నెలకు వేల రూపాయల ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు.SCSS (సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్) అనేది పోస్టాఫీసులో అందుబాటులో ఉన్న వివిధ పథకాలలో ఒకటి. ఇది సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్. ఇది పోస్టాఫీసు పొదుపు పథకాలలో అత్యధిక రాబడిని తెచ్చే పథకం. ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పోస్టాఫీసులోనే కాకుండా బ్యాంకులలో కూడా అందుబాటులో ఉంది. పదవీ విరమణ తర్వాత పెన్షన్ సౌకర్యాలు లేని వారి కోసం ఈ SCSS రూపొందించారు.

స్కీమ్‌ మూడు ప్రయోజనాలు:

  1. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో చేసే పెట్టుబడి డబ్బుకు పన్ను మినహాయింపు అందుబాటులో ఉంది.
  2. ఈ పథకం ప్రస్తుతం వార్షిక వడ్డీ రేటును 8.2% అందిస్తోంది.
  3. మీరు ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు. త్రైమాసిక ఆదాయాన్ని పొందవచ్చు. అంటే మీకు ప్రతి మూడు నెలలకు వడ్డీ లభిస్తుంది.

ఈ పథకానికి ఎవరెవరు అర్హులు?

60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లు SCSS ఖాతాను తెరవవచ్చు. VRS పొందిన వారు 55 ఏళ్లు దాటి ఉండాలి. సైన్యంలో పనిచేసి ఉంటే 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా SCSS ఖాతాను తెరవవచ్చు.

Taxi Services: మీరు ట్యాక్సీ బుక్‌ చేసుకుంటున్నారా..? మీకో గుడ్‌న్యూస్‌..!

ఎంత పెట్టుబడి పెట్టవచ్చు?

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ ఖాతాలో కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్ట పెట్టుబడి రూ.30 లక్షలు. వాయిదాలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతి లేదు. డబ్బును ఒకేసారి పెట్టుబడి పెట్టాలి.

ఇవి కూడా చదవండి

మీరు SCSS ఖాతాలో రూ.30 లక్షలు జమ చేస్తే ప్రస్తుత వడ్డీ రేటు 8.2% కొనసాగితే మీకు సంవత్సరానికి రూ.2.46 లక్షల వడ్డీ వస్తుంది. ఈ 12 నెలల వడ్డీ ఆదాయం నెలవారీగా చూస్తే రూ.20,500 పొందవచ్చు. అదనంగా సంవత్సరానికి రూ.1.50 లక్షల వరకు వడ్డీ ఆదాయానికి పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది.

Vande Bharat: ఈ ప్రాంత ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్‌.. ఈ రెండు మార్గాల్లో వందే భారత్‌ నిలిపివేత!

ఇది కూడా చదవండి: మీకు ఆధార్‌ కార్డు ఉందా..? ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.50 వేల రుణం!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *