
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్ vs పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్లోనే ఒక పరుగుకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. నాలుగు బంతుల్లో పరుగులు చేయడంలో అభిషేక్ విఫలమయ్యాడు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు.
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), బాబర్ ఆజం, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, ఉస్మాన్ ఖాన్(కీపర్), షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్.