Optical Illusion: మీవి డేగ కళ్లా..? ఐతే ఈ ఫొటోలో పక్షిని 10 సెకన్లలో గుర్తించండి..

Optical Illusion: మీవి డేగ కళ్లా..? ఐతే ఈ ఫొటోలో పక్షిని 10 సెకన్లలో గుర్తించండి..


ఆప్టికల్ ఇల్యూషన్‌, బ్రెయిన్‌ టీజర్లు మనల్ని గందరగోళానికి గురి చేస్తాయి. కానీ మీరు ఎంత తెలివైనవారో పరీక్షించుకోవడానికి ఇవి భలేగా ఉపయోగపడతాయి. అందుకే చాలా మంది ఆప్టికల్ ఇల్యూషన్‌లు సాల్వ్‌ చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇలాంటి ఫొటోల్లో కొన్ని గమ్మత్తైనవిగా ఉంటాయి. ఎంతకూ పరిష్కరించలేమనే సవాల్‌ విసురుతూ ఉంటాయి. అలాంటి ఓ ఆప్టికల్ భ్రమ చిత్రం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక్కడున్న ఫొటోలో పచ్చని కొమ్మల మధ్యలో ఓ హమ్మింగ్‌బర్డ్ దాక్కుంది. పది సెకన్లలో మీరు ఈ పక్షిని కనుగొంటే మీది సూక్ష్మదృష్టి అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలో పచ్చని చెట్టు కొమ్మలు గుబురుగా ఉండటం మీరు చూడవచ్చు. పూర్తిగా ఆకులు, కొమ్మలతో కప్పబడి ఉంది. అయితే ఈ చెట్టుపై ఒక హమ్మింగ్ బర్డ్ కూడా ఉంది. ఈ పక్షిని 10 సెకన్లలో గుర్తించాలి. కనిపించిందా..?

మీరు హమ్మింగ్‌బర్డ్‌ని చూశారా?

ఒక వేళ మీకు ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలో హమ్మింగ్‌ బర్డ్‌ కనిపించకపోతే మరేం కంగారు పడవద్దు. ఈ కింది ఫొటోలో అదెక్కడ ఉందో చూడొచ్చు. సూర్యకాంతి ప్రతిబింబించడం వల్ల ఆకులు, కొమ్మల నీడల మధ్య పక్షి కూర్చుని ఉండటం మీరు గమనించవచ్చు. ఈ రకమైన పజిల్స్ సాధన చేయడం మీ దృష్టి పెరుగుతుంది. పరిశీలన నైపుణ్యాలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు, ఆలోచనా నైపుణ్యాలు, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, IQ స్థాయి కూడా పెరుగుతుంది.

Optical Illusion

మరిన్ని ట్రెండింగ్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *