Viral Video: వార్నీ ఇదెక్కడి వింత.. తనను తానే మింగేస్తున్న పాము! ఎందుకో తెలుసా?

Viral Video: వార్నీ ఇదెక్కడి వింత.. తనను తానే మింగేస్తున్న పాము! ఎందుకో తెలుసా?


Viral Video: వార్నీ ఇదెక్కడి వింత.. తనను తానే మింగేస్తున్న పాము! ఎందుకో తెలుసా?

చాలా మంది పాముల చూస్తేనే ఆమడదూరం పరిగెడతారు. ఎందుకంటే అవి చాలా విషపూరితమైనవి.. అవి కరిస్తే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచింది. అయితే ఈ పాములు ప్రచంలో ఉన్న అన్ని జీవుల కన్నా కొన్ని విచిత్రమైన లక్షణాలను కలిగి ఉంటాయి. అందుకే పాములు అంటే భయం ఉన్నప్పటికీ చాలా మంది వాటి గురించి చెప్తే వినడానికి ఆసక్తి చూపుతారు. మీకూ ఆ ఇంట్రెస్ట్ ఉంచే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడో పాము చాలా వింతగా తనను తానే మింగేసేందుకు ప్రయత్నించింది.

అవును వినడానికి ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే నిజమనే అనిపిస్తోంది. తాజాగా @TheeDarkCircle అనే ఎక్స్ ఖాతాలో అప్‌లోడ్ చేసిన వీడియో ప్రకారం.. ఒక పాము తన తోక భాగాన్ని తానే మింగేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇలానే తోక నుంచి మొదలు కొద్ది కొదిగా ఆ పాము తన మొత్తం శరీరాన్ని మింగేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఉష్ణోగ్రతలు ఎక్కవైనప్పుడు, లేదా పాములు తీవ్రంగా ఒత్తిడి గురైనప్పుడు వాటి నాడి వ్యవస్థ లోపించి.. అవి ఇలా ప్రవర్తిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

వీడియో చూడండి.. 

అయితే ఈ దృశ్యాన్ని చూసిన ఓ వ్యక్తి అందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఇది ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇప్పటి వరకు ఈ వీడియోకు వేలల్లో లైక్స్, వీవ్స్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశాయి. పాములు ఆకలి వేసినప్పుడు తన పిల్లలనే తింటాయని విన్నాం, కానీ వాటిని అవే తినడం ఇప్పుడే చూస్తున్నామని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *