సాధారణంగా ఒక సినిమా అంచనాలు అందుకోలేకపోతే, ఆ ప్రభావం తదుపరి సినిమాపై బలంగా పడుతుంది. అయితే, మన తెలుగు స్టార్ హీరోల విషయంలో మాత్రం ఈ నియమం వర్తించదు. తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ పవర్ తదుపరి స్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా మన హీరోల సినిమాలపై అంచనాలు భారీగా ఉంటాయి. రామ్ చరణ్ గత చిత్రం గేమ్ చేంజర్ డిజాస్టర్ అయినప్పటికీ, ఆయన నటిస్తున్న పెద్ది చిత్రంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం కనిపించడం లేదు. బిజినెస్, క్రేజ్, మార్కెట్ పరంగా ఈ చిత్రం చరణ్ కెరీర్లోనే టాప్‌లో ఉంది. మెగా వారసుడు ఈ చిత్రంతో బలమైన కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఎన్టీఆర్ విషయంలోనూ ఇదే పరిస్థితి. పదేళ్ల తర్వాత వార్ 2తో ఫ్లాప్ ఎదుర్కొన్నప్పటికీ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న సినిమా తారక్ కెరీర్లోనే అత్యధిక బిజినెస్ చేస్తోంది. ఈ సినిమా విజయం సాధిస్తే రికార్డులు చెల్లాచెదురు కావడం ఖాయం.
మరిన్ని వీడియోల కోసం :