ఏం జరుగుతుందా అని ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఇంజిన్లో పేలుడు సంభవించి, లోపలి భాగాలు చెల్లాచెదురై ఫ్యాన్ బ్లేడ్లు విరిగాయి. అయితే అలర్టయిన పైలెట్లు విమానాన్ని బెనిన్ ఎయిర్పోర్ట్ వైపు మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు.ల్యాండింగ్ సమయంలో ఇంజిన్ లోపలి భాగాలు బయటకు కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 80 మంది ప్రయాణికులు తృటిలో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇంజిన్ ఇన్లెట్ భాగం పూర్తిగా విరిగిపోయినట్లు గుర్తించారు. దీనిని ‘ఫ్యాన్ బ్లేడ్ ఆఫ్’ ఘటనగా పరిగణిస్తారట. నైజీరియా ఇన్వెస్టిగేషన్ బోర్డు దర్యాప్తు ప్రారంభించింది. ఫ్యాన్ బ్లేడ్ ఆఫ్ అనేది విమాన ఇంజిన్లో తీవ్ర సాంకేతిక లోపాన్ని సూచించే పదం. టర్బోఫ్యాన్ ఇంజిన్లో గాలి పీల్చుకునే భాగంలో పెద్ద ఫ్యాన్ బ్లేడ్లు ఉంటాయి. వీటిలో ఒక బ్లేడ్ విరిగి, ఇంజిన్ లోపల నుంచి బయటకు రావడం ప్రమాదకర పరిస్థితికి దారి తీయొచ్చనీ విరిగిన బ్లేడ్ ముక్కలు ఇంజిన్, విమానం ఇతర భాగాలను దెబ్బతీయొచ్చని చెబుతున్నారు నిపుణులు.
మరిన్ని వీడియోల కోసం :