45 పైసలకే రూ.10 లక్షల బీమా

45 పైసలకే రూ.10 లక్షల బీమా


ఏ ఇన్సూరెన్స్‌ అయినా కనీసం 500 రూపాయలు చెల్లించాల్సిందే. కానీ జస్ట్ 45 పైసలతో 10 లక్షల ప్రమాద బీమా పొందే ఛాన్స్ ఉంది. ఈ ఇన్సూరెస్ పథకం కేవలం ట్రైన్లలో అది కూడా ఆన్‌లైన్ టికెట్లు బుక్ చేసుకునే వారికి మాత్రమే లభిస్తుంది. ట్రైన్ టికెట్లు బుక్ చేసే సమయంలో చాలా మంది ఇన్సూరెన్స్ ఆప్షన్ పట్టించుకోకుండా వదిలేస్తారు. అది సరైంది కాదని నిపుణులు చెబుతున్నారు. రైల్వే e-టికెట్ బుక్ చేస్తున్నప్పుడు ‘ఆప్ట్ ఫర్ ఇన్సూరెన్స్’ అనే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ ఎంచుకుంటే ప్రతి ప్రయాణికుడు 45 పైసలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టికెట్ కన్ఫార్మ్ అయిన తర్వాత బీమా పాలసీ వివరాలు ఫోన్‌కు అందుతాయి. ప్రయాణికులు సదరు బీమా కంపెనీ వెబ్‌సైట్‌లో నామినీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. నామినీ నమోదు చేయటం అనేది తప్పనిసరి కాకపోయినా.. క్లెయిమ్ సమయంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ముందుగానే నమోదు చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

వ్యూహం ఫలించింది..విజయం వరించింది వీడియో

చూస్తుండగానే కుప్పకూలిన మెట్రో పిల్లర్

ఈ భక్తి ఓ వింత .. ఆలయ గ్రిల్‌కు తాళాలు వేసే భక్తులు

భారీ ఆఫర్ వదిలేసిన రౌడీ బాయ్.. కారణం ఇదే..!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *