సంక్రాంతి బరిలో విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. థియేటర్లలో రికార్డుల వసూళ్లు సాధించి, రీజనల్ ఇండస్ట్రీలో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు డిజిటల్‌లోనూ అదే జోరు కొనసాగిస్తూ, సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. వసూళ్ల పరంగా నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకొని ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
మరిన్ని వీడియోల కోసం :