గుడికి వెళ్లి చెప్పులు పోగొట్టుకోవడం.. శుభమా..? అశుభమా..? పెద్ద కథే ఉంది..!

గుడికి వెళ్లి చెప్పులు పోగొట్టుకోవడం.. శుభమా..? అశుభమా..? పెద్ద కథే ఉంది..!


సాధారణంగా మనం గుడి దగ్గరి వరకు చెప్పులు/పాదరక్షకులు వేసుకుని వెళతాం. ఆ తర్వాత వాటిని గుడి ముందే విడిచిపెట్టి లోపలికి దైవ దర్శనం కోసం వెళతాము. అయితే, చాలా రద్దీగా ఉండే దేవాలయాలలో మనం పాదరక్షలు తీసి లోపలికి వెళ్లిన తర్వాత అవి కనిపించకపోవడం తరచూ జరుగుతుంది. అలాంటప్పుడు మనం కొంత బాధపడతాం. “జాగ్రత్తగా పెట్టుకోలేకపోయాం” అని మనల్ని మనమే నిందించుకుంటాం. అయితే జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఇది తప్పనిసరిగా చెడు సంకేతం కాదు.. కొన్నిసార్లు ఇది శుభ సూచకంగా కూడా భావించబడుతుంది.

శుభ పరిణామం..

ప్రత్యేకంగా జాతకంలో శని దోషం ఉన్నవారికి, దేవాలయంలో పాదరక్షలు పోవడం శని ప్రభావం తగ్గుతున్న సంకేతంగా భావిస్తారు అని జ్యోతిష్యులు చెబుతారు. ఇది పాపభారం తగ్గిపోవడం, జీవితంలో ఉన్న అప్పులు లేదా అడ్డంకులు క్రమంగా తొలగిపోవడం, శుభ పరిణామాలు ప్రారంభమవడం వంటి సూచనగా చూడబడుతుంది.

పాదరక్షలు విడిచిపెట్టడం అంటే..

దేవాలయానికి వెళ్లినప్పుడు పాదరక్షలు తీసేయడం ఒక సాధారణ ఆచారం మాత్రమే కాదు.. అది ఒక గొప్ప భావనను కూడా సూచిస్తుంది. ఆలయం వెలుపల పాదరక్షలు విడిచిపెట్టడం అంటే మన గర్వం, అహంకారం, ద్వేషం వంటి నెగెటివ్ భావాలను బయటే వదిలి, భక్తితో దేవుని ముందు లొంగిపోవడం అనే అర్థం ఉంది.

పాదరక్షకులు ఏం సూచిస్తాయంటే..?

ఇది రామాయణంలో కనిపించే ఒక సందర్భాన్ని గుర్తు చేస్తుంది. శ్రీరాముడు వనవాసానికి వెళ్లినప్పుడు, భరతుడు ఆయన పాదుకలను సింహాసనంపై ఉంచి, వాటిని పూజిస్తూ, రాముని పేరుతో రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ సంఘటన పాదరక్షలు ఒక వ్యక్తి శక్తి, అధికారం, బాధ్యతలను ఎలా సూచిస్తాయో తెలియజేస్తుంది.

పాదరక్షలు దానం చేస్తే..

పాదరక్షలు కేవలం రక్షణ సాధనాలు మాత్రమే కాదు; అవి క్రమశిక్షణ, సంస్కారం, స్థిరత్వానికి కూడా చిహ్నాలుగా భావించబడతాయి. అందుకే పాదాన్ని పూర్తిగా కప్పే పాదరక్షలు ధరించడం శుభప్రదంగా పరిగణిస్తారు. అలాగే, అవసరమైన వారికి పాదరక్షలను దానం చేయడం కూడా పుణ్యకార్యంగా భావించబడుతుంది. శని ప్రభావం ఉన్నవారు సోమవారం, బుధవారం లేదా శనివారం ఒక జత పాదరక్షలను దానం చేస్తే శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం ఉంది.

సన్యాసులు ధరించే చెక్క పాదరక్షలు ఆధ్యాత్మిక స్వచ్ఛత, సరళ జీవనం, త్యాగ భావనలకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఈ విధంగా పాదరక్షలు మన సంస్కృతిలో భౌతిక అవసరాన్ని మించి, ఆధ్యాత్మిక అర్థాన్ని కూడా కలిగి ఉన్నాయని చెప్పవచ్చు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందుబాటులోని వనరుల నుంచి సేకరించి అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *