పనస గింజల్లో ఇనుము పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు కూడా సహాయపడుతుంది. దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తహీనతను నివారించవచ్చు. పనస గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి, తరచుగా మలబద్ధకంతో బాధపడేవారు వీటిని తినాలి .
అలాగే, జీర్ణ సమస్యలు ఉన్న వారికి కూడా పనస గింజలు ఎంతో మంచిదని చెబుతున్నారు. పనస గింజలను పొడి చేసుకుని తీసుకుంటే జీర్ణ సమస్యలు ముఖ్యంగా గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయని సూచిస్తున్నారు.
అలాగే, విటమిన్ ఎ పనస గింజల్లో పుష్కలంగా లభ్యమవుతుంది. విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి ముఖ్యమైన పోషకాలలో ఒకటన్న సంగతి తెలిసిందే. కాబట్టి, పనస గింజలను ఉడకబెట్టి లేదా వేరే విధంగా కూడా తీసుకోవచ్చు. దాంతో కంటి ఆరోగ్యం పెరుగుపడుతుంది.
అదేవిధంగా పనస గింజల్లో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఎముకులను, దంతాలను దృఢంగా మారుస్తాయి. గుండె పోటు, ఇతర గుండె జబ్బులు రాకుండా రక్షిస్తాయి. జాక్‌ఫ్రూట్ గింజలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మీరు పనస గింజలను వేయించి తినవచ్చు. వాటిని ఒక పాన్ మీద 15-20 నిమిషాలు వేయించాలి. అవి కొద్దిగా గోధుమ రంగులోకి మారిన తర్వాత, వాటిపై కొంచెం నల్ల ఉప్పు, చాట్ మసాలా చల్లి తినండి.
పనస గింజలను ఎండలో ఎండబెట్టి పొడి చేసి, సలాడ్లు లేదా పండ్లపై చల్లి తినవచ్చు. మీకు ఇష్టమైన పండ్లతో పాటు పనస గింజల సహాయంతో మీరు స్మూతీలను కూడా తయారు చేసుకోవచ్చు.




