రోజంతా గోరువెచ్చని నీరు తాగితే ఏమవుతుంది..? ఈ సమయాల్లో అమృతం కూడా విషమేనా..

రోజంతా గోరువెచ్చని నీరు తాగితే ఏమవుతుంది..? ఈ సమయాల్లో అమృతం కూడా విషమేనా..


రోజంతా గోరువెచ్చని నీరు తాగితే ఏమవుతుంది..? ఈ సమయాల్లో అమృతం కూడా విషమేనా..

నీరు శరీర దాహాన్ని తీర్చడమే కాకుండా రక్తంలో కలిసిపోయి ప్రతి కణానికి ఆక్సిజన్‌ను సరఫరా చేసే జీవనాధారం. మానవ శరీరం 70 శాతం నీటితోనే నిర్మితమై ఉంటుంది. అయితే ఏ రకమైన నీరు ఎప్పుడు తాగాలి అనే విషయంలో చాలామందికి స్పష్టత ఉండదు. మన పూర్వీకుల నుండి వస్తున్న ఉదయం గోరువెచ్చని నీరు తాగే అలవాటు కేవలం సంప్రదాయం మాత్రమే కాదు అదొక అద్భుతమైన ఆరోగ్య ప్రక్రియ అని ఆయుర్వేదం చెబుతోంది.

జీర్ణ అగ్నిని రగిలించే గోరువెచ్చని నీరు

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరంలోని జీర్ణ అగ్ని యాక్టివేట్ అవుతుంది. ఇది శరీరంలోని కఫ దోషాన్ని సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

గోరువెచ్చని నీటితో కలిగే టాప్ 4 ప్రయోజనాలు:

జీర్ణక్రియ మెరుగు: తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి, మలబద్ధకం సమస్యను వదిలించడానికి ఇది చక్కటి పరిష్కారం.

టాక్సిన్స్ తొలగింపు: శరీరం లోపల పేరుకుపోయిన హానికరమైన విష పదార్థాలను బయటకు పంపి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

బరువు తగ్గడం: క్రమం తప్పకుండా వేడి నీటిని తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం రేటు పెరిగి, కొవ్వు కరగడానికి సహాయపడుతుంది.

శ్వాసకోశ సమస్యలకు చెక్: గొంతులో పేరుకుపోయిన కఫాన్ని వదులు చేసి, దగ్గు, జలుబు నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.

నీరు తాగడానికి సరైన సమయం ఏది?

ఉదయం ఖాళీ కడుపుతో: బాడీని రీఛార్జ్ చేయడానికి, జీర్ణక్రియను వేగవంతం చేయడానికి ఇది బెస్ట్ టైమ్.

భోజనానికి 30 నిమిషాల ముందు: ఇది ఆకలిని నియంత్రించి, బరువు తగ్గాలనుకునే వారికి ఉపయోగపడుతుంది.

భోజనం చేసిన గంట తర్వాత: తిన్న ఆహారం మెత్తగా మారి, పోషకాలు ఒంటికి పట్టడానికి ఇది సహాయపడుతుంది.

ఎప్పుడు తాగకూడదు?

గోరువెచ్చని నీరు ఆరోగ్యానికి మంచిదే అయినా, ఈ కింది సందర్భాల్లో తాగడం ప్రమాదకరమని ఆయుర్వేదం హెచ్చరిస్తోంది..

తీవ్రమైన వేసవిలో: ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వేడి నీరు తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి అసౌకర్యం కలుగుతుంది.

పిత్త సమస్యలు ఉన్నప్పుడు: కడుపులో మంట లేదా అసిడిటీతో బాధపడేవారు వేడి నీటికి దూరంగా ఉండాలి.

అధిక దాహం: విపరీతమైన డీహైడ్రేషన్ ఉన్నప్పుడు గోరువెచ్చని నీరు తాగితే శరీరంలోని తేమ మరింత తగ్గే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *