School Holidays: విద్యార్థులకు ప్రభుత్వం సూపర్ న్యూస్.. రేపు స్కూల్స్‌కు సెలవు..

School Holidays: విద్యార్థులకు ప్రభుత్వం సూపర్ న్యూస్.. రేపు స్కూల్స్‌కు సెలవు..


School Holidays: విద్యార్థులకు ప్రభుత్వం సూపర్ న్యూస్.. రేపు స్కూల్స్‌కు సెలవు..

మహాశివరాత్రి ఈ సారి ఆదివారం రావడంతో విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆఫీసులకు, బ్యాంకింగ్ సంస్థలకు సాధారణ సెలవు వచ్చింది. అయితే ఏపీ ప్రభుత్వం సోమవారం కూడా సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఆప్షనల్ సెలవు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ శివరాత్రి సందర్భంగా చాలామంది రాత్రంతా జాగరణ చేస్తూ ఉంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సోమవారం ఆప్షనల్ హాలీడే ప్రకటించినట్లు స్పష్టం చేశారు. 16వ తేదీన ఐచ్చిక సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ ప్రభుత్వాన్ని కోరారు. శివరాత్రి జాగరణ చేసిన తర్వాత మరుసటి రోజు ఆఫీసులు హాజరవ్వడం ఇబ్బందిగా ఉంటుంది. ఈ క్రమంలో ఉద్యోగుల విన్నపం మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 4వ తేదీన సెలవుల లిస్ట్‌ విడుదల చేయగా.. అందులో సవరణలు చేస్తూ గెజిట్ జారీ చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం సెలవు తీసుకునే అవకాశం లభించింది.

స్కూల్స్‌కు సెలవు

ఇక ఫిబ్రవరి 16న ఏపీలోని స్కూల్స్‌కు కూడా ప్రభుత్వం ఆప్షన్ హాలీడే ప్రకటించింది. ఈ మేరకు డీఈవో రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. ప్రభుత్వం స్కూల్స్‌కు ఆప్షనల్ హాలీడ్ ఇచ్చిందని, కానీ టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షల వల్ల స్కూల్స్ యథావిథిగా నడుస్తాయని అన్నారు. హెచ్‌ఎంలు, టీచర్లు తప్పనిసరిగా స్కూల్స్‌కు హాజరై ప్రీ ఫైనల్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించారు. కాగా హాశివరాత్రి తిథి ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటలకు మొదలై ఫిబ్రవరి 16 సాయంత్రం 5.34 గంటల వరకు ఉంటుంది. దీంతో ప్రధాన పండుగ ఫిబ్రవరి 15నే ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో 16వ తేదీన సెలవు ప్రకటించగా.. తెలుగు రాష్ట్రాల్లో 15వ తేదీన పండుగ జరుపుకుంటున్నారు. దీంతో 16వ తేదీన ఆప్షనల్ హాలీడే ఇచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *