Snake In Stadium : భారత్, పాకిస్థాన్ జట్లు ఆదివారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కంటే రెండు రోజుల ముందు, అంటే శుక్రవారం సాయంత్రం పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, ఇతర ఆటగాళ్లు ప్రాక్టీస్ కోసం స్టేడియానికి రావాల్సి ఉంది. సరిగ్గా వారు వచ్చే కొద్ది నిమిషాల ముందే డగౌట్ సీట్ల వద్ద ఒక పాము పాకుతూ కనిపించింది. వెంటనే అప్రమత్తమైన గ్రౌండ్ స్టాఫ్ దానిని సురక్షితంగా పట్టుకుని బయటకు తరలించారు. ఈ ఊహించని పరిణామంతో పాక్ శిబిరంలో కాసేపు టెన్షన్ నెలకొంది.
శ్రీలంకలో ఇది సర్వసాధారణమేనా?
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో పాములు కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో జరిగిన లంక ప్రీమియర్ లీగ్ సమయంలో కూడా ఇలాగే మైదానంలోకి పాములు చొరబడ్డాయి. అయితే భారత్-పాక్ లాంటి ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు ముందు ఇలా జరగడంతో అభిమానులు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు చేస్తున్నారు. గ్రౌండ్లో కంటే ముందే డగౌట్లో పాము వచ్చేసింది అంటూ కొందరు సరదాగా ట్రోల్ చేస్తుంటే, భద్రతా ఏర్పాట్లపై మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాక్ జట్టులో కీలక మార్పులు?
మరోవైపు, భారత్‌ను ఎదుర్కోవడానికి పాకిస్థాన్ పక్కా ప్లాన్‌తో సిద్ధమవుతోంది. హెడ్ కోచ్ మైక్ హెసన్, కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా.. ఈ మ్యాచ్‌లో నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో (ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లు) బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. స్పిన్నర్లు అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిక్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఆశ్చర్యకరంగా ఆల్‌రౌండర్లు షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్‌లలో ఒకరిని పక్కన పెట్టే ఆలోచనలో పాక్ మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.
🚨 Snake in Pakistan’s dugout 🐍
A snake was spotted in Pakistan’s dugout during a practice session at the R. Premadasa Stadium in Colombo ahead of the India vs Pakistan T20 World Cup match. pic.twitter.com/BW7J6OBObE
— Sonu (@Cricket_live247) February 14, 2026
సూర్యకుమార్ యాదవ్ అదిరిపోయే మైండ్ గేమ్
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పాక్ బౌలర్లను ఎదుర్కోవడానికి కొత్త వ్యూహాలను సిద్ధం చేశాడు. ముఖ్యంగా పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ వింతైన బౌలింగ్ యాక్షన్‌ను నెట్స్‌లో అనుకరిస్తూ సూర్య కనిపించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అయ్యింది. పాక్ బౌలర్లను సిలబస్ వెలుపల వచ్చే ప్రశ్నలతో పోల్చిన సూర్య, వారిని ఎదుర్కోవడానికి తాము మానసిక సిద్ధంగా ఉన్నామని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ధీమా వ్యక్తం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి