పైన ఫోటోలో కనిపిస్తున్న కుర్రాళ్లలో ఒక స్టార్ హీరో ఉన్నాడు. అతడికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కిపోద్ది. అటు హీరోగా.. ఇటు రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. ఇంతకీ అందులో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా.. ? పైన కనిపిస్తున్న ఫోటోను మెగాస్టా్ర్ చిరంజీవి తీశారట. మొదటిసారి కెమెరా పట్టుకుని తాను తీసిన మొదటి ఫోటో అంటూ చెప్పుకొచ్చారు. అందులో ఉన్న స్టార్ హీరో మరెవరో కాదు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ ఫోటోలో మధ్యలో నిల్చున్న కుర్రాడే పవన్. చిరు మొట్ట మొదటి సారిగా ‘AGFA Click-III’ కెమెరాతో తీసిన పిక్ ఇది. నేను తీసిన మొదటి ఫోటో.. ఇందులో ఉన్న ఐదుగురిలో ఒక వ్యక్తి మీకు బాగా తెలుసు. ఎవరో చెప్పండి అంటూ అభిమానులకే ఛాలెంజ్ విసిరాడు చిరు.
ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టిన చిరు.. స్వయంకృష్మితో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అన్నయ్య బాటలోనే సినీరంగంలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. నటుడిగా సక్సెస్ అయ్యాడు. అద్భుతమైన నటనతో పవర్ స్టార్ గా అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. బద్రి, ఖుషి వంటి చిత్రాలు పవన్ కెరీర్ ను మలుపు తిప్పాయి. ఇప్పటికీ చిరు, పవన్ ఇద్దరు వరుస సినిమాలతో సినీరంగంలో సందడి చేస్తున్నారు.
ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్లో సంచలనంగా మారింది..
మరోవైపు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అటు నటుడిగా ఇన్నాళ్లు ప్రేక్షకులను అలరించిన పవన్.. ప్రస్తుతం ప్రజా సేవలో బిజీగా ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ప్రారంభంలోనే మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు చిరు. సంక్రాంతి పండక్కి వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది.
ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..
ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..