Tollywood : హిట్ కావాలా నాయనా.. సీక్రెట్ ఫార్ములా ఇదే..! దేవుడి మీద భారం వేస్తే చాలు..!

Tollywood : హిట్ కావాలా నాయనా.. సీక్రెట్ ఫార్ములా ఇదే..! దేవుడి మీద భారం వేస్తే చాలు..!


ట్రెండ్ మారింది.. మాస్ మసాలా నుంచి డివైన్ మ్యాజిక్ వైపు మన సినిమా అడుగులు పడుతున్నాయి. ఒకప్పుడు కమర్షియల్ సినిమా అంటే ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, ఒక ఐటమ్ సాంగ్ అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. మన హీరోలు, దర్శకులు ఇప్పుడు కథ కోసం విదేశీ పుస్తకాలను వెతకడం మానేసి, మన పురాణాలనే తిరగేస్తున్నారు. అంతా దేవుడు చూసుకుంటాడు అని సామాన్యులు అనుకోవడం సహజం.. కానీ ఇప్పుడు మన స్టార్ హీరోలు కూడా బాక్సాఫీస్ భారాన్ని ఆ దేవుడిపైనే వేస్తున్నారు. కాంతార, కార్తికేయ 2, హనుమాన్ వంటి చిత్రాలు సాధించిన అనూహ్య విజయాలు మన మేకర్స్ కళ్ళు తెరిపించాయి. కేవలం భక్తి ఉంటే సరిపోదు, దానికి గ్రాండ్ విజువల్స్, అద్భుతమైన కథనం తోడైతే బాక్సాఫీస్ షేక్ అవుతుందని బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తెరకెక్కుతున్న ప్రతి ప్రతిష్టాత్మక చిత్రంలోనూ దేవుడే సెంటర్ పాయింట్ అవుతున్నాడు. ఇది కేవలం ఒక సెంటిమెంట్ మాత్రమే కాదు, ఇదొక బిజినెస్ స్ట్రాటజీగా కూడా మారింది.

తాజాగా పెదకాపు ఫేమ్ విరాట్ కర్ణ హీరోగా.. అభిషేక్ నామా దర్శకత్వంలో వస్తున్న ‘నాగబంధం’ టీజర్ చూస్తే ఈ మార్పు ఎంత స్పష్టంగా ఉందో అర్థమవుతుంది. మహేష్ బాబు చేతుల మీదుగా లాంఛ్ అయిన ఈ టీజర్.. విజువల్స్ పరంగా ఒక విజువల్ వండర్ లా కనిపిస్తోంది. సినిమా కథాంశం మొత్తం ఆ పరమశివుడి చుట్టూ.. నాగసాధువుల మిస్టరీ చుట్టూ తిరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఒక కొత్త హీరో సినిమాకి ఇంత గ్రాండ్ స్కేల్, ఇంతటి భారీ బడ్జెట్ పెడుతున్నారు అంటే.. ఆ కథలో ఉన్న డివైన్ ఎలిమెంట్ మీద నిర్మాతలకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం విజువల్స్ మాత్రమే కాకుండా.. సౌండ్ డిజైన్, బ్యాక్‌డ్రాప్ అంతా గూస్‌బంప్స్ తెప్పించేలా ప్లాన్ చేశారు. శివుడిని నమ్ముకుంటే సినిమా సగం గెలిచినట్లే అనే సెంటిమెంట్‌ను ఈ సినిమా మరోసారి రుజువు చేసేలా ఉంది.

ఇక పాన్ వరల్డ్ రేంజ్‌లో మన పురాణాలకు పట్టం కట్టే సమయం ఆసన్నమైంది. సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న వారణాసి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వారణాసి నేపథ్యంలో శివయ్య సాక్షిగా, సాక్షాత్తు ఆ రాముడి లక్షణాలతో మహేష్ బాబు పాత్ర ఉండబోతోందన్న వార్తలు సినిమా స్థాయిని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్తున్నాయి. ఇండియన్ కల్చర్‌ని గ్లోబల్ ఆడియన్స్‌కి పరిచయం చేయడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా..! మరోవైపు బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి ఏకంగా 2000 కోట్ల భారీ బడ్జెట్‌తో రామాయణం తెరకెక్కిస్తున్నారు. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత కాస్ట్లీ ప్రాజెక్ట్. అంటే, మన ఇతిహాసాల మీద పెట్టుబడి పెడితే.. తిరిగి వచ్చే రాబడి ఏ స్థాయిలో ఉంటుందో నిర్మాతలు అంచనా వేస్తున్నారు.

కేవలం భారీ విజువల్స్ మాత్రమే కాదు.. కథలో దైవ రహస్యం జోడించి థ్రిల్ చేసే పంథా కూడా పెరిగింది. నాగచైతన్య నటిస్తున్న వృషకర్మ పూర్తిగా దేవుడున్నాడా లేదా అనే డైలమా చుట్టూ తిరిగే మిస్టిక్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దీనిని తెరకెక్కిస్తుండటంతో.. ఇందులో భక్తితో పాటు భయం, ఉత్కంఠ కూడా ఉంటాయని ఆశించవచ్చు. ఇక చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభరలో సాక్షాత్తు ఆంజనేయుడి రిఫరెన్స్ ఉండబోతోందని టాక్. దానికి తోడు ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ఎలాగూ హనుమంతుల వారి కథే. చిరంజీవి, ప్రశాంత్ వర్మ వంటి వాళ్ళు హనుమాన్ సెంటిమెంట్‌ను నమ్ముకోవడం చూస్తుంటే.. ఆంజనేయుడు ఇప్పుడు టాలీవుడ్ ఆపద్బాంధవుడిగా మారాడనిపిస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *