Headlines

Horoscope Today: వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: వారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (ఫిబ్రవరి 15, 2026): మేష రాశి వారు ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరగడానికి అవకాశం ఉంది. మిథున రాశి వారు ఉద్యోగంలో పదోన్నతికి, జీతభత్యాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితం ప్రోత్సాహకరంగా, సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. శ్రమాధిక్యత ఉన్నా ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. బంధుమిత్రులతో కలిసి ఒక శుభ కార్యంలో పాల్గొంటారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరగడానికి అవకాశం ఉంది. ఆస్తి, ఆర్థిక ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల మీద ఆధారకపడకపోవడం మంచిది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. బంధుమిత్రులలో కొందరికి ఆర్థికంగా సహాయం చేయడం, ఇతరత్రా అండగా నిలబడడం జరుగుతుంది. అనవసర పరిచయాలకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో పదోన్నతికి, జీతభత్యాలకు సంబంధించి ఆశించిన శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు బాగా పెరిగే అవకాశముంది. పెండింగు పనులు పూర్తి చేయడంలో వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. మిత్రులు మిమ్మల్ని సొంత పనులకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆస్తి వ్యవహారాలు చికాకు పెడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పు‌ష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల నుంచి చాలా వరకు బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వాహన యోగం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగులకు అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. పదోన్నతికి బాగా అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాలు పరవాలేదనిపిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా కాస్తంత ఒత్తిడి ఉంటుంది. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. పిల్లలు చదువుల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా వృద్ధి చెందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. తోబుట్టువులతో మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడండి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ప్రయా ణాలు బాగా లాభిస్తాయి. నిరుద్యోగులకు ఉన్నతావకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహాయ సహకారాలు తీసుకోవడం మంచిది. విలాసాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడుపుతారు. పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఉద్యోగంలో మీ సమర్థతకు, శక్తి సామర్థ్యాలకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి జీవితంలో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు చాలావరకు లాభసాటిగా సాగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అవసరానికి బంధు మిత్రుల నుంచి సహకారం అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగుల మీద అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు, సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ఆదాయంతో సమానంగా అనవసర ఖర్చులు పెరుగుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లల నుంచి శు‍భవార్త వింటారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదు కానీ, శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి. ఆకస్మిక ప్రయాణాలకు బాగా అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా లాభసాటిగా పురోగమిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల మీద వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. బంధువులకు ఇతోధికంగా సహాయం చేస్తారు. ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి అడుగు వేయడం మంచిది. అనుకోకుండా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్త వింటారు. కుటుంబ వ్యవహారాల్లో ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వవద్దు. ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలున్నప్పటికీ, అధికారుల అండతో అన్నీ పరిష్కారమవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం కలిసి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక ముఖ్యమైన వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబ సభ్యులతో సరదాగా, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఇతరుల బాధ్యతలను మీరు మోయడం మంచిది కాదు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ వాతావరణం సానుకూలంగా సాగిపోతుంది. సహోద్యోగులతో బాధ్యతలు పంచుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఉన్నప్పటికీ సరైన ప్రతిఫలం పొందుతారు. అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా ఒత్తిడిఉన్నా, ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా చక్కబెడతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *