
మన వంటగదిలో తరచుగా కనిపించే అల్లం, ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే, తాజా అల్లం కంటే ఎండిన అల్లం ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని పోషకాహార నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ శొంఠిని ప్రతిరోజూ నీటిలో కలిపి తాగడం వల్ల లెక్కలేనన్ని ఆరోగ్య లాభాలు కలుగుతాయని వారు సూచిస్తున్నారు.
ఎండిన అల్లం ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారికి అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర కొవ్వును కరిగించే సామర్థ్యం దాదాపు 10 శాతం పెరుగుతుంది. ఎండిన అల్లంతో తయారు చేసిన హెర్బల్ టీ తాగడం వల్ల శరీరం దాదాపు 90 నుండి 110 కేలరీలు ఎక్కువగా బర్న్ చేస్తుందని అనేక అధ్యయనాల ఫలితాలు చూపించాయి. తద్వారా కొన్ని వారాల్లోనే 1 నుంచి 1.5 కిలోల బరువు తగ్గవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది కేలరీలను అధికంగా బర్న్ చేయడానికి కూడా తోడ్పడుతుంది.
బరువు తగ్గడమే కాకుండా, ఎండిన అల్లం నొప్పి, వికారం లాంటి సమస్యల నుంచి గణనీయమైన ఉపశమనం కలిగిస్తుంది. మైగ్రేన్ తలనొప్పిపై జరిపిన అధ్యయనాల్లో, అల్లం నొప్పి తీవ్రతను, వికారం వచ్చే ఫీలింగ్‌ను తగ్గిస్తుందని చెబుతున్నారు. మైగ్రేన్ తలనొప్పి, గర్భధారణ సంబంధిత వికారం, మోషన్ సిక్నెస్ లాంటివి తగ్గిస్తుంది. అల్లం ఎండినప్పుడు, అందులోని జింజరాల్స్ షోగోల్స్గా మారి, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను పెంచుతాయి. ఇవి శరీరంలో వేడిని ఉత్పత్తి చేసి, బ్రౌన్ ఫ్యాట్‌ను యాక్టివేట్ చేయడం ద్వారా కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. ఒక కప్పు వేడి నీటిలో అర టీస్పూన్ నుండి ఒక టీస్పూన్ ఎండు అల్లం పొడిని కలిపి ఉదయాన్నే తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. అయితే ఉదయాన్నే ఎండిన అల్లం నీరు తాగడం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం దీనిని తీసుకోవడం వల్ల మెటబాలిజంపెరుగుతుంది. మైగ్రేన్లు లేదా వికారం వంటి సమస్యల కోసం అయితే, భోజనం తర్వాత కూడా ఈ నీటిని తాగవచ్చు. క్రమం తప్పకుండా శొంఠిని మీ డైలీ రొటీన్లో భాగం చేసుకోవడం మంచిదని చెబుతున్నారు వైద్య నిపుణులు.