తెలుగులో ఆమె చేసిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయినప్పటికీ ఆశలు మాత్రం వదలుకోలేదు. చాలా కాలం తర్వాత ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆమె నటించిన సినిమా ఏకంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇంతకీ ఆమె ఎవరంటే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ కేరళ కుట్టి. కానీ ఇప్పటివరకు తెలుగులో సరైన హిట్టు మాత్రం అందుకోలేదు. ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.
ఈ సినిమా నిరాశ పరిచినప్పటికీ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో ఆమె చేసిన సినిమాలు అంతగా మెప్పించలేకపోయాయి. ఇక ఇటీవల కొత్త లోక సినిమాతో ఈ ముద్దుగుమ్మ భారీ విజయాన్ని అందుకుంది.
డిఫరెంట్ కథతో వచ్చిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఒక్క సినిమాతోనే అటు మలయాళం, ఇటు తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు తెలుగులో అవకాశం కోసం వెయిట్ చేస్తుంది.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కళ్యాణి.. తాజాగా బ్లాక్ డ్రెస్ లో స్టన్నింగ్ స్టిల్స్ షేర్ చేసింది. గ్లామరస్ ఫోజులతో మతిపోగొట్టే అందాలతో కట్టిపడేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మడు షేర్ చేసిన లేటేస్ట్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.




