Cinema : ఇదేం సినిమా భయ్యా.. భయానికే భయం పుట్టిస్తోంది.. 9 సంవత్సరాలుగా యూట్యూబ్‏లో ట్రెండింగ్..

Cinema : ఇదేం సినిమా భయ్యా.. భయానికే భయం పుట్టిస్తోంది.. 9 సంవత్సరాలుగా యూట్యూబ్‏లో ట్రెండింగ్..


స్తుతం కంటెంట్ నచ్చితే చాలు థియేటర్లకు బ్రహ్మరథం పడుతున్నారు అడియన్స్. అలాగే అటు ఓటీటీలోనూ కొత్త కొత్త సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో హారర్, మిస్టరీ, సస్పెన్స్ కంటెంట్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. వీటిలో అత్యధికంగా వీక్షించబడిన సినిమాలు హారర్ చిత్రాలే. అలాంటి సినిమా కథ ప్రేక్షకులను భయపెట్టడమే కాకుండా భావోద్వేగ స్థాయిలో వారిని కనెక్ట్ చేస్తుంది. ప్రేమ, విచారం, భయానక సత్యాలతో ఉన్న అతీంద్రియ సంఘటనలు ఈ కథను మరింత ప్రభావితం చేస్తాయి. అలాగే ఆ సినిమాలోని బీజీఎమ్, ఎంచుకున్న ప్రదేశాలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతున్నట్లు అనిపిస్తుంది.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

ప్రతి క్షణం.. ప్రతి సీన్ ప్రేక్షకులకు భయాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. మనం మాట్లాడుతున్న మూవీ 2017 లో విడుదలైంది. ఇది టర్కిష్ హారర్-డ్రామా సిరీస్. ఈ సిరీస్ పేరు ‘సాహిప్లి’, ఇంగ్లీష్ పేరు ‘పోస్సెడ్’. ఈ సిరీస్‌ను ప్రముఖ హారర్ దర్శకుడు ఆల్పర్ మెస్టి దర్శకత్వం వహించారు. ఈ కథ బుష్రా అనే డాక్టర్, సెలిమ్ అనే టీచర్ చుట్టూ తిరుగుతుంది. వారిద్దరూ తమ గత గాయాలను మోసుకుంటూ ఒక గ్రామానికి చేరుకుంటారు. ఆ గ్రామానికి చేరుకున్న తర్వాత, వారి జీవితాల్లో కొన్ని సంఘటనలు జరగడం ప్రారంభిస్తాయి, అవి క్రమంగా భయానక మలుపు తీసుకుంటాయి.

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..

ఇందులో ఫండా గురే, బరన్ అక్బులుట్ , ఫెరిట్ కయా వంటి టర్కిష్ నటులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. బుష్రా భర్త ఆమె పెళ్లి రాత్రి మరణిస్తాడు. ఈ షాక్ నుండి కోలుకోవడానికి, ఆమె తన గ్రామానికి తిరిగి వస్తుంది. అయితే, ఆమె చుట్టూ వింతైన, భయానక సంఘటనలు జరగడం ప్రారంభిస్తాయి. అటువంటి పరిస్థితిలో, ఆమె సెలిమ్ దగ్గరికి వస్తుంది. కానీ సెలిమ్‌కు కూడా ఒక చీకటి గతం ఉంటుంది. గ్రామంలోని పాత నమ్మకాలు, మూఢనమ్మకాలు వాతావరణాన్ని మరింత రహస్యంగా మారుస్తాయి. మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఆద్యంతం కట్టిపడేస్తుంది. ప్రతి ఎపిసోడ్ దాదాపు 40 నుండి 45 నిమిషాల నిడివి ఉంటుంది. ఈ సిరీస్ IMDbలో 6.8 రేటింగ్‌ను పొందింది.

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *