Moon Transit: కుంభరాశిలో చంద్రుడు.. వారి మనసులో కోరికలు తీరే సమయం!

Moon Transit: కుంభరాశిలో చంద్రుడు.. వారి మనసులో కోరికలు తీరే సమయం!


ఈ నెల (ఫిబ్రవరి) 17, 18, 19 తేదీల్లో చంద్రుడు కుంభ రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ఈ రాశిలో అప్పటికే ఉన్న రవితో చంద్రుడు కలవడం వల్ల అమావాస్య ఏర్పడుతుంది. సాధారణంగా నీచ బడినా, అమావాస్య వచ్చినా చంద్రుడు బాగా బలహీనపడే అవకాశం ఉంటుంది. అయితే, గురు దృష్టి కలిగినప్పుడు మాత్రం చంద్రుడికి బలం పెరుగుతుందే తప్ప తగ్గడం జరగదు. ఈ మూడు రోజుల్లో చంద్రుడిని గురువు వీక్షించడంతో పాటు, శుభ గ్రహాలైన బుధ, శుక్రులతో కూడా కలవడం వల్ల చంద్రుడు కొన్ని రాశులకు యోగాలనివ్వడం జరుగుతుంది. అవిః మేషం, వృషభం, మిథు నం, తుల, వృశ్చికం, మకరం. ఈ అమావాస్య చంద్రుడి ప్రభావం మార్చి 2 వరకు కొనసాగుతుంది.

  1. మేషం: ఈ రాశికి చతుర్థాధిపతి అయిన చంద్రుడు లాభ స్థానంలో రవితో కలిసినందువల్ల ఈ రాశివారి జీవితంలో ఆకస్మిక శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆదాయ వృద్ధికి, పదోన్నతులకు సంబంధించి వీరు కంటున్న కలలు సాకారమవుతాయి. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల పెద్ద ఎత్తున ధన లాభం కలగడానికి అవకాశం ఉంది. రావలసిన డబ్బు, రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
  2. వృషభం: ఈ రాశికి దశమ స్థానంలో అమావాస్య ఏర్పడడం, దాన్ని గురువు వీక్షించడం వల్ల ఉద్యోగులకు, నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశీ అవకాశాలు లభించడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. మనసులోని కొన్ని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన అవసరాలు, సమస్యలు తీరిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
  3. మిథునం: ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన చంద్రుడు భాగ్య స్థానంలో రవితో కలవడం, దాన్ని గురువు వీక్షించడం వల్ల అనేక విధాలుగా ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు చాలావరకు తగ్గిపోయే అవకాశం ఉంది. అనారోగ్యాల నుంచి కూడా చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఉద్యోగంలో హోదాలు, వేతనాలు అంచనాలకు మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి.
  4. తుల: దశమ స్థానాధిపతి చంద్రుడు ఈ రాశికి పంచమ స్థానంలో రవితో కలవడం వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు చేపడతారు. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి కూడా అవకాశం ఉంది. నిరుద్యోగులకు భారీ జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు కూడా అందుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆర్థికంగా మెరుగైన స్థితికి చేరుకుంటాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి.
  5. వృశ్చికం: ఈ రాశికి చతుర్థ స్థానంలో రవి, చంద్రుల కలయిక జరిగి అమావాస్య ఏర్పడడం వల్ల కుటుంబం బాగా వృద్ధిలోకి రావడం గానీ, కుటుంబ సభ్యుల్లో ఒకరు ఘన విజయాలు సాధించడం గానీ జరుగుతుంది. కొద్ది ప్రయత్నంతో గృహ, వాహన సౌకర్యాలు కలుగుతాయి. విదేశీయానానికి ఆటంకాలు తొలగిపోతాయి. విదేశాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.
  6. మకరం: ఈ రాశికి ధన స్థానంలో రవి, చంద్రులు కలవడం, ఈ యుతికి శుభ గ్రహాల సంబంధం ఏర్పడడం వల్ల అనేక విధాలుగా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో వేతనాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు రెట్టింపయ్యే సూచనలున్నాయి. షేర్లు, స్పెక్యులేషన్లు అంచనాలకు మించి లాభిస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి సంక్రమిస్తుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *