హిందూ మతంలో జ్యోతిషశాస్త్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. శతాబ్దాలుగా మనకు భవిష్యత్తు అంచనాలు, వ్యక్తిత్వ రహస్యాలు అందిస్తూ వస్తుంది ఈ శాస్త్రం. అది ఒక వ్యక్తి వివాహంలో ఎలాంటి పాత్ర వహించబోతున్నాడో కూడా అంచనా వేస్తుంది. వ్యక్తి జన్మ రాశి, నక్షత్రం వంటి అంశాలతో పాటు, పుట్టిన నెల కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. “మంచి భార్య” అనే అర్థం వ్యక్తి వ్యక్తికి మారవచ్చు. అయినప్పటికీ, కొన్ని లక్షణాలు కొన్ని మహిళల్లో సహజంగా కనిపిస్తాయి. కొన్ని నెలల్లో జన్మించిన మహిళలు ఈ లక్షణాలన్నింటినీ కలిగి ఉండి, ఒక ఆదర్శ భార్యగా పరిగణింపబడతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.